Sunday, September 8, 2024
HomeTrending Newsపారిశుధ్య సేవలు మాధవ సేవతో సమానం: చెల్లుబోయిన

పారిశుధ్య సేవలు మాధవ సేవతో సమానం: చెల్లుబోయిన

సమాజంలో ప్రధమ వైద్యుడు పారిశుధ్య కార్మికుడని, వీరి సేవలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలు తమ ఆరోగ్య సమస్యలనుంచి ఉపశమనం సాధించవచ్చని రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార-పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.  రామచంద్రపురం నియోజవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పారిశుద్ధ్య కార్మికుల తగురీతిలో వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. ఆదివారం రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని లైన్స్ క్లబ్ లో పారిశుధ్య కార్మికుల అభినందన సభలో మంత్రి ప్రసంగించారు.  తన నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం అర్బన్, రామచంద్రపురం రూరల్, కే గంగవరం, కాజులూరు మండలాలు చెందిన 283 పారిశుధ్య కార్మికులను మంత్రి సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘స్వచ్ఛత – మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాన్ని స్వచ్ఛ, స్వేచ్ఛ, స్నేహ, సేవా నియోజకవర్గంగా రూపుదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు విస్తృతస్థాయిలో గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు . ప్రతిరోజు ఒక గ్రామంలో రెండు రోజులపాటు స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమం చేపట్టి విధంగా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా పట్టణ ప్రాంతంలో కూడా ప్రతిరోజు ప్రతి వార్డులో రెండు రోజులు పాటు స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమాలు జరుగుతాయి అన్నారు. ఇప్పటికే రామచంద్రపురంలో ‘గుడ్ మార్నింగ్ రామచంద్రపురం’ మొదలుపెట్టి 50% ఫలితాలు సాధించామని… త్వరలో స్వచ్ఛ రామచంద్రపురం సాధించే విధంగా ముందుకు వెళుతున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో గ్రామస్థాయి యంత్రాంగం తో పాటు సంబంధిత శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో పరిశుభ్రత నెలకొల్పే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామాలు స్వచ్ఛంగా ఉంటే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని ఆ ప్రభావం పౌరులపై ఉంటుందని, పరిశుభ్రత సాధించడానికి పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతైనా అవసరం ఉందన్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను దైవ సేవలతో సమానంగా అభివర్ణించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్