Friday, March 29, 2024
HomeTrending Newsఅరచేతిలో వైకుంఠం రేవంత్ నైజం - హరీష్ విమర్శ

అరచేతిలో వైకుంఠం రేవంత్ నైజం – హరీష్ విమర్శ

రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప అభివృద్ధి గడప దాటలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు ఇక్కడ(కోడంగల్) అభివృద్ధి చేయలేక పోయారని ప్రశ్నించారు. ఈ రోజు వికారాబాద్, నారాయణ్ పెట్ జిల్లాల్లో మొత్తం 42.34 కోట్లతో 6 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 8 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేసుకోవడం సంతోషంగా ఉందని, కొస్గి ఆసుపత్రిని రెండు నెలల్లో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. టిఆర్ ఎస్ పాలనలో కొడంగల్ కొత్త రూపు సంతరించుకున్నదని, రేపో మాపో పాలమూరు నీళ్ళు తెచ్చి మీ పాదాలు కడుగుతామని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి హరీష్ రావు ప్రసంగం ఆయన మాటల్లోనే….

మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కోరిక మేరకు ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచి, మంచి వైద్యాన్ని అందిస్తాము. నాడు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లో మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండే.. ఇప్పుడు 100 కి పెంచుకున్నాము. కొడంగల్ లోనూ కొత్త కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. పాలమూరు పై కేసులు వేస్తున్నారు, అడ్డుకుంటున్నారు. అయినా పనులు ఆగవు. అతి త్వరలో నీళ్ళు కొడంగల్ వైపు తీస్తాము. 60 ఏళ్లల్ల కానీ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. మీ పక్కనే కర్ణాటక బార్డర్ ఉంది. ఒక్కసారి అడిగి తెల్సుకొండి. కర్ణాటకలో డబుల్ డెక్కర్ ప్రభుత్వం ఉంది. ఏమైందీ 6 గంటలు కూడా కరెంట్ రావడం లేదు. 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. మాట ఇచ్చారు సీఎం నిలబెట్టుకున్నారు.

కర్ణాటకలో 500 పింఛన్ ఇస్తే, మనం 2016 ఇస్తున్నాం. త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు ఇస్తాము. మరో పది లక్షల మందికి అందుతాయి. కొడంగల్ లో నీళ్ల కొరత తీవ్రంగా ఉండే. సీఎం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు అందిస్తున్నారు. రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తరు. 8,9 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నావు ఎందుకు అభివృద్ధి చేయలేదు. ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ, బస్ డిపో ఎందుకు తేలేదు. రైతు డిక్లరేషన్ అంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ఘడ్, రాజస్థాన్ లో చేయండి. కన్న తల్లికి అన్నం పెట్టనోడు, పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడా.

మీరు అధికారంలోకి వచ్చేది లేదు.. ఆ అవకాశమే లేదు.అభయ హస్తం డబ్బులు ఇప్పటికే ఇస్తున్నాం. మిగిలిన వారికి ఈ నెలలో అందిస్తాము. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తాము. కేంద్రం మన మీద కక్ష కట్టింది. కాంగ్రెస్ ఖతం, గతం..ముగిసిన చరిత్ర. రాహుల్ అధ్యక్షుడు అయిన తర్వాత 100 కు 97 శాతం ఓటమే. అనంతరం దళిత బంధు యూనిట్లు మంత్రి పంపిణీ చేశారు.

Also Read : కాంగ్రెస్ అంటే గతం…మంత్రి హరీష్ ఎద్దేవా

RELATED ARTICLES

Most Popular

న్యూస్