Sunday, November 24, 2024
HomeTrending Newsప్రతిపక్షాల బురద రాజకీయాలు - మంత్రి హరీశ్ ఫైర్

ప్రతిపక్షాల బురద రాజకీయాలు – మంత్రి హరీశ్ ఫైర్

వరదలు వస్తే ప్రజలను ఆదుకోవడం తెలియదు గాని బురద రాజకీయం మాత్రం చేస్తారని మంత్రి హరీశ్ రావు విపక్షాల తీరుపై ఫైర్ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు ప్రజల మధ్యలో ఉండి పని చేస్తే.. ఈ పతిపక్ష పార్టీల నాయకులు మాత్రం ఇల్లు కదలలేదని విమర్శించారు. సంగారెడ్డిలో ఈ రోజు 50 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు. అనంతరం పైలాన్ ను ఆవిష్కరించారు. అంతకుముందు 2.90 కోట్లతో బీసీ హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. 1.38 కోట్లతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, రు. 15 కోట్లతో నీళ్ళ ట్యాంకును, 15 లక్షలతో నిర్మించిన బస్తీ దావాఖానను  మంత్రి ప్రారంభించారు. పార్టీ ఆఫీసుల్లో కూర్చొని, ప్రెస్స్ మీట్లకు పరిమితం అయిన విపక్ష నేతలు…దమ్ముంటే కేంద్రం నుండి వరద సాయం రాష్ట్రానికి అందేలా చేయాలని సవాల్ చేశారు. చరిత్రలో ఎన్నడూ ఇంత వర్షం నమోదు కాలేదు. ఒక్క ప్రాణం పోకుండా కాపాడిన ఘనత ప్రభుత్వానిదన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు మర్చిపోరు.. ప్రభుత్వ సాయం పొందిన చేతులు మమల్ని మరిచిపోవన్నారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ప్రభుత్వ పథకాలు రద్దు చేయడమా..అన్న మంత్రి హరీష్ డబుల్ ఇంజన్ అంటే కరెంట్ లేక పోవడమా, కళ్యాణ లక్ష్మి లేక పోవడమా, రు. 2016 పింఛన్లు ఇవ్వక పోవడమా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఉచితాలు బంద్ చేయాలి అంటున్నారు. కేసీఆర్ కిట్ బంద్ చేయాలా, నెల నెలా ఇచ్చే బియ్యం బంద్ చేయాలా.. కల్యాణ లక్ష్మి బంద్ చేయాలా.. అన్నారు. నీరవ్, లలిత్ మోడీ బ్యాంకులను మోసం చేస్తే, 12 లక్షల కోట్లు మాఫీ చేసారు. పేదలకు మాత్రం ఉచితాలు వద్దు అంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న ఏ ఒక్క పథకమైన డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రాష్ట్రాల్లో అమలవుతున్నాయా..40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నము. వచ్చే రెండు నెలల్లో 10 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నమన్నారు.

సాధారణ డెలివరీలు ప్రోత్సహించాలని వైద్యులకు సూచించారు. సి సెక్షన్ వల్ల తల్లి, బిడ్డకు నష్టం. 30 ఏళ్ల వయసు వస్తె చాలు బరువులు మోయలేరు. ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. వైద్యుల సూచన మేరకు, అవసరం అయితే తప్ప సి సెక్షన్ కి వెళ్లకూడదు. నార్మల్ డెలివరీ చేయాలని వైద్యులను అడగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా ఉంటాయి. మన వద్ద సి సెక్షన్లు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు ఒకప్పటి లాగా లేవు. పూర్తిగా మారిపోయాయి. పైసా ఖర్చు లేకుండా వైద్యం, పరీక్షలు, మందులు అందుతున్నాయన్నారు. పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలి.. ఉచిత వైద్యాన్ని పొందాలన్నారు.

Also Read : బెదిరిస్తే ఓట్లు రాలవు- హరీష్ రావు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్