Sunday, January 19, 2025
HomeTrending Newsరాహుల్‌ గాంధీకి టి.ఆర్.ఎస్ ప్రశ్నాస్త్రాలు

రాహుల్‌ గాంధీకి టి.ఆర్.ఎస్ ప్రశ్నాస్త్రాలు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ‌కుల‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్ర్టాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ మరోసారి మండిపడ్డారు. ఎన్‌పీఏ((పనికిరాని ఆస్తి- నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్‌) గ‌వ‌ర్న‌మెంట్‌లో భార‌త‌దేశ ఎకాన‌మీని నాశ‌న‌మైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి వెళ్లింది. ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ప్రపంచంలోనే అత్యధికం. 45 ఏండ్ల‌లో అత్య‌ధికంగా నిరుద్యోగ రేటు పెంచార‌ని మండిప‌డ్డారు. అలాంటి వారు తెలంగాణ‌కు వ‌చ్చి మాకు నీతులు చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. తెలంగాణ వ‌స్తున్న రాహుల్ గాంధీకి స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై స్ట‌డీ చేయాల‌ని సూచించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌ని కేటీఆర్ సూచించారు.

రాహుల్‌ కు ప్రశ్నాస్త్రాలు..

తెలంగాణలో పర్యటించనున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీకి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు సంధించారు. మీరు కానీ, మీ పార్టీ కానీ పార్లమెంటులో తెలంగాణ అంశాలు, హక్కులను ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ పోరాడుతుంటే రాహుల్‌ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వరి కొనుగోలు విధానం ఒకేలా ఉండాలని తాము పోరాడుతున్నప్పుడు ఎక్కడికిపోయారని, తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నప్పుడు ఎక్కడున్నారని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు.

Also Read :

నేపాల్ నైట్ క్లబ్ ఎఫెక్ట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్