Saturday, November 23, 2024
HomeTrending Newsఇద్దరం రాజీనామా చేద్దాం – మంత్రి సవాల్

ఇద్దరం రాజీనామా చేద్దాం – మంత్రి సవాల్

మూడు చింతలపల్లి లో 62కోట్ల రూపాయలతో అన్ని రకాల అభివృద్ధి పనులు చేశామని, మూడు చింతలపల్లి అనే  కొత్త మండలం ఏర్పాటు చేసింది మా ప్రభుత్వమేనని మంత్రి చామకుర మల్లా రెడ్డి వెల్లడించారు. మూడు చింతలపల్లి లో సమస్యలు లేవు కాబట్టే రేవంత్ ను రావొద్దు అని ప్లకార్డులు చూపించారన్నారు. మంత్రి మల్లారెడ్డి ,ఎమ్మెల్యే కె .పి .వివేకానంద ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ,టీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ,మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డిలు తెలంగాణ భవన్ లో విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి ఆరోపణలకు మంత్రి మల్లారెడ్డి ఘాటుగా బదులిచ్చారు. మల్లారెడ్డి మాటల్లోనే…  మూడు చింతలపల్లి లో ఉన్న అభివృద్ధి కొడంగల్ లో ఉందా? రేవంత్ రెడ్డి ఓ దొంగ- బట్టేవాజ్. మల్లారెడ్డి ఎపుడూ బ్రోకర్ దందా చెయ్యలేదు. నేను లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నా, బ్రోకరిజం చేసి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. మల్లారెడ్డి కాలేజీలపై పార్లమెంట్ లో రేవంత్ అడిగితే కేసులు లేవని క్లిన్ చీట్ ఇచ్చింది. నేను కబ్జా చేసినట్లు రేవంత్ నిరూపించాలి!. రేవంత్ రెడ్డి అప్పుడే సీఎం అయినట్లు ఫస్ట్ సంతకాలు అని వాగ్ధానాలు చేస్తుండు. తెలంగాణ లో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే నేను నా పదవికి రాజీనామా చేస్తానన్నారు.

కాంగ్రేస్ పార్టీ దివాళా తీసిన పార్టీ అని గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రేస్ చేసిన అభివృద్ధి ఏంటో రేవంత్ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మూఢుచింతల పల్లి సభ పెట్టినందుకు దళితులు తిడుతున్నారు. రేవంత్ రెడ్డి ఖబడ్ధార్ ఇక రేపటి నుంచి చూసుకుంటానని మంత్రి హెచ్చరించారు. భూములను జేబులో పెట్టుకోని తిరుగుతలెను- కంప్యూటర్ లో చూస్తే అసైన్డ్ ల్యాండా? కాదా అని తెలుస్తది కావాలంటే రేవంత్ చూసుకోవాలన్నారు. ఇద్దరం రాజీనామా చేద్దాం…రేవంత్ రెడ్డి ఎంపీగా మళ్లా గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి (రేవంత్ రెడ్డి కి(మంత్రి మల్లారెడ్డి తోడ గొట్టి సవాల్) సవాల్ విసిరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్