Saturday, January 18, 2025
Homeసినిమా‘ERROR500” టీజర్ ని రిలీజ్ చేసిన మంత్రి తలసాని

‘ERROR500” టీజర్ ని రిలీజ్ చేసిన మంత్రి తలసాని

మైత్రేయ మోషన్ పిక్చర్స్ పతాకం పై యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మాతగా యువ నటుడు జస్వంత్ పడాల, నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు సాందీప్ మైత్రేయ ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ERROR500”. ఈ మూవీ టీజర్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మైత్రేయ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘ERROR500” చిత్రం టీజర్ ని విడుదల చేయడం ఆనందంగా వుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో యువత రావాల్సిన అవసరం వుంది. యువతని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ERROR500 యూనిట్ చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి” అని కోరారు.

జస్వంత్ మాట్లాడుతూ.. మా టీజర్ ని విడుదల చేసిన మంత్రివర్యులు తలసాని గారికి కృతజ్ఞతలు. వారి ప్రోత్సాహం మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. మా డెబ్యు మూవీకి ఆయన టీజర్ విడుదల చేయడం గొప్ప ఆశీర్వాదంగా అనిపించింది. ‘ERROR500’ అందరికీ కనెక్ట్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. నన్ను హీరోగా పరిచయం చేసినమైత్రేయ మోషన్ పిక్చర్స్ వారికి కృతజ్ఞతలు. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు వస్తోంది” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్