Sunday, February 23, 2025
HomeTrending Newsదత్త తండ్రి కోసం...: పవన్ కు మంత్రుల కౌంటర్

దత్త తండ్రి కోసం…: పవన్ కు మంత్రుల కౌంటర్

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లపై మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లు స్పందించారు. పవన్ పై విమర్శులు ఎక్కు పెడుతూ వారు కూడా ట్వీట్ లతో ఎదురుదాడి చేశారు.

ప్యాకేజీ కోసం మొరిగే వాళ్ళకి గర్జన అర్ధమవుతుందా? అంటూ పవన్ ను ఉద్దేశించి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

మరోవైపు ‘దత్త తండ్రి చంద్రబాబు తరఫున.. దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ మియావ్ మియావ్… అంటూ మొరుగుతున్నారంటూ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు.

మియావ్.. మియావ్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ త్రీ క్యాపిటల్స్ః 1-అంతర్జాతీయ రాజధాని మాస్కో 2-జాతీయ రాజధాని ముంబాయి 3-పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంటూ విమర్శలు చేశారు.

Also Read : దేనికి గర్జనలు?: జనసేనాని వరుస ట్వీట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్