Sunday, January 19, 2025
HomeTrending Newsబిజెపి కక్ష సాధింపు - మంత్రుల ఆరోపణ

బిజెపి కక్ష సాధింపు – మంత్రుల ఆరోపణ

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆరోపించారు. నిధులు ఇవ్వకపోగా వివిధ పథకాల్లో కోతలు విధిస్తూ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందన్నారు. ఇందుకు ఉదాహరణగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని వారు వివరించారు. అలాగే రాష్ట్రపరంగా చేసే అప్పుల విషయంలోనూ అనేక ఆంక్షలు విధించారని వారన్నారు. బిజెపి ఎంపీల వల్ల రాష్ట్రానికి గాని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంకు గాని, చివరకు వారి సొంత గ్రామాలకు కూడా ఒరిగిందేమీ లేదని వారు అన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ సొంతూరు జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ లు పలు రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో పాల్గొనేందుకు సోమవారం పైడిపల్లికి విచ్చేసిన మంత్రులు దయాకర్ రావు, ఈశ్వర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రలకు గులాబీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. డప్పులు, బోనాలు, లంబాడీ, కోలాటం కళాకారుల నృత్యాలు, టపాసులు పేల్చుతూ యువత, మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మంత్రులు దయాకర్ రావు, ఈశ్వర్, కమలాకర్ లు అంబారీపేట నుంచి తాళ్ల కొత్తపేట వరకు 12కోట్లు, పైడిపల్లి నుంచి పడకల్ వరకు కోటి 40లక్షల రోడ్లు, 30లక్షలతో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రులు దయాకర్ రావు, ఈశ్వర్, కమలాకర్ లతో కలిసి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అద్భుతంగా అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. అభివృద్ధి సంక్షేమాలను సమపాళ్లలో చేపట్టిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని చెప్పారు. ఇవాళ తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని వారన్నారు.

సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా అమలవుతున్నాయని మంత్రులు చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక మొత్తంలో పెన్షన్లు అందజేస్తున్నారని ఒంటరి మహిళలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, బోధకాలు, ఎయిడ్స్, డయాలసిస్ పేషంట్లకు కూడా పెన్షన్లు అందజేస్తున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్లు ప్రజలకు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు, వాటి ద్వారా మంచినీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు, వంటి కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు మంచి జరుగుతుందని పంటలు బాగా పండుతున్నాయని ప్రజలు సుభిక్షంగా ఉన్నారని చెప్పారు.

Also Read : Jagadish Reddy:కాంగ్రెస్ కు సోయి లేదు – జగదీష్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్