Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్అమిత్ షా తో మిథాలీ  భేటీ

అమిత్ షా తో మిథాలీ  భేటీ

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ను  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. గత నెల చివరి వారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు  సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన భారతీయ  జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాను ఆమె కలుసుకున్న సంగతి తెలిసిందే. ఒక నెల వ్యవధిలోనే ఆమె అమిత్ షాను కూడా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత మహిళా క్రికెట్ కు రెండు దశాబ్దాల పాటు ఎనలేని సేవలందించిన మిథాలీ రాజ్ దేశ ప్రతిష్టను ఎన్నోసార్లు ఇనుమడింప జేశారని, ప్రపంచ వ్యాప్తంగా వర్ధమాన క్రీడాకారులకు ఆమె ఓ స్పూర్తిగా నిలుస్తారని, మిథాలీ తో ఓ మంచి సమావేశం జరిగిందని అమిత్ శా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Also Read: సెప్టెంబర్ 17తో ఓటు బ్యాంకు రాజకీయాలు అమిత్ షా

RELATED ARTICLES

Most Popular

న్యూస్