ముందుగా చెప్పినట్టుగా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగ్గారెడ్డి సంచలన ప్రకటన జోలికి వెళ్లలేదు. బీజేపీ, టీఆర్ఎస్‌పై విమర్శలు చేసి తన ప్రెస్‌మీట్ ముగించారు. దీంతో జగ్గారెడ్డి మళ్లీ మెత్తబడిపోయారనే విషయం తేలిపోయింది. సంచలన ప్రకటన ఏమైందని మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నించినా.. వాటి గురించి వద్దని చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి తాను గొడవ పడేది ఎత్తుగడే అనుకోండని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధమంతా వ్యూహామని జగ్గారెడ్డి చెప్పారు. రాజకీయాల్లో ఎత్తుగడలుంటాయన్నారు. తాను సంచలన వ్యాఖ్యలు చేయడానికి ఇంకా సమయం ఉందన్నారు. ఏ రాజకీయపార్టీ తనను డామినేట్ చేయలేదని, పార్టీ లైన్ లో ఉంటానన్నారు. ఎక్కడికి వెళ్లనని కూడా చెప్పారు.తాను పార్టీ వీడాలని అనుకొంటే తనను ఆపేది ఎవరని కూడా జగ్గారెడ్డి ప్రశ్నించారు.సోనియాగాంధీని కలిసి కాంగ్రెస్ లలో చోటు చేసుకొంటున్న పరిణామాలను వివరిస్తానని ఆయన చెప్పారు.
విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ కు ఈ నెల 2న వచ్చారు. యశ్వంత్ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో టీఆర్ఎస్ ఘనంగా స్వాగతం పలికింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు పాల్గొన్నారు. యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికే కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొనవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించినా బండకేసి కొట్టాల్సిందేనని రేవంత్ రెడ్డి మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను జగ్గారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
Also Read : కెసిఆర్ ఆగమైతుండు – జగ్గారెడ్డి