Sunday, January 19, 2025
HomeTrending Newsఅరవింద్ జాగ్రత్త...చౌరస్తాలో చెప్పుతో కొడతా - కవిత వార్నింగ్

అరవింద్ జాగ్రత్త…చౌరస్తాలో చెప్పుతో కొడతా – కవిత వార్నింగ్

నిజామాబాద్ కు ఎంపీ అరవింద్ ది సంకుచిత మనస్తత్వం, ఆయనవి చిల్లర మాటలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోకుండా ఎంపీ గా అయ్యారు.186 మంది అభ్యర్థులను నిజామా బాద్ లో బరి లో దింపారని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో…  ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. నిజామాబాద్ ఎంపీ గా అరవింద్ లాంటి వ్యక్తి ఉండటం దురదృష్టకరం అన్నారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు ఆమె మాటల్లోనే…

పార్లమెంటు లో అరవింద్ పనితనం సున్నా. పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేశారు. అరవింద్ ది ఫేక్ డిగ్రీ.. దీనిపై నేను రాజస్థాన్ యూనివర్సిటీకి పిర్యాదు చేస్తాను. అరవింద్ బురద లాంటోడు. నిన్న ప్రెస్ మీట్లో నీచంగా మాట్లాడారు. అరవింద్ భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అనిపిస్తోంది.. బాధేస్తుంది. నేను సమస్యల మీద మాట్లాడతాను.. వ్యక్తుల గురుంచి ఎపుడూ మాట్లాడలేదు. కానీ అరవింద్ తీరు చూసి మాట్లాడక తప్పడం లేదు.

కుక్క కాటు కు చెప్పు దెబ్బ తప్పదు. మళ్లీ నా గురించి పార్టీ మారడం గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తా లో చెప్పు తో కొడతా. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నా. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ లో చేరేందుకు నేను ఖర్గే తో మాట్లాడాను అనేది శుద్ధ తప్పు. తెలంగాణ వాసన లేని పార్టీ ల్లో నేనెలా చేరుతాను. నా జీవితం నేను నమ్మే ఏకైక నాయకుడు కేసీఆర్. నా రాజకీయ ప్రయాణం కేసీఆర్ తోనే.

నాకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమే. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడం పై మాట్లాడారు. బీజేపీలోని స్నేహితులు, అనుబంధ సంఘాలు ఈ ప్రతిపాదన తెచ్చాయి. ప్రజల్ని, నాయకుల్ని మోసం చేయబోమని నేను చెప్పాను. మా శక్తితోనే నాయకులవుతాం… బ్యాక్‌డోర్ నుంచి కాదు. వాళ్ల ప్రతిపాదనను మర్యాదపూర్వకంగానే తిరస్కరించాను. మేం ప్రజల్లోనే ఉంటాం. అన్నింటినీ ఎదుర్కొంటాం. తెలంగాణలో షిండే మోడల్ నడవదు. జై మోడీ అన్న వారి పైన ed దాడులు ఉండవు. ED, IT, CBI మోడీ అల్లుళ్లు అని లాలూ యాదవ్ ఎపుడో చెప్పారు. ఈడి దాడులకు భయపడం.. జాతీయ రాజకీయాలోకి కచితంగా వెళతాం. అరవింద్ కాంగ్రెస్ నేతలతో ఏం పని. బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ కు పని చేస్తున్నారా. నిజామాబాద్ లో కాంగ్రెస్ తో కుమ్మకై నా మీద గెలిచారు.

Also Read : ఉత్త చేతులతో వచ్చిన మోడీ – కవిత

RELATED ARTICLES

Most Popular

న్యూస్