Sunday, January 19, 2025
HomeTrending Newsట్విట్టర్లో ట్రెండ్ లో "మోదీ మస్ట్ రిజైన్"

ట్విట్టర్లో ట్రెండ్ లో “మోదీ మస్ట్ రిజైన్”

Modi Must Resign :  శ్రీలంక ప్రభుత్వం పైన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒత్తిడి తీసుకువచ్చి అదాని కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులతోపాటు, వేలాది మంది నెటిజన్లు ప్రధాని మోడీ రాజీనామా చేయాలని ట్విట్టర్ వేదికగా నినదించారు. అదాని కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని, శ్రీలంక పవర్ ప్రాజెక్టును అదానీకి ఇవ్వాలని మోదీ ఒత్తిడి చేసినట్లు పోస్ట్లు చేశారు. అదానీకి అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో అసహనం వ్యక్తం చేశారు. భారత సంపద దోచి అదానీకి పంచడం సరికాదంటూ ట్విట్టర్లో పోస్టింగ్లు పెట్టారు.

మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో ట్విట్టర్ లో ప్రారంభమైన మోదీ మస్ట్ రిజైన్” # ట్యాగ్ ట్రెండింగ్ నిన్న(బుధవారం) సాయంత్రం 8 గంటల నుంచి ఈ రోజు ఉదయం 7.30 గంటల తర్వాత కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి కి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అనేక మంది ఇతర నెటిజన్ల ట్వీట్లు చేశారు. వీటికి భారీ స్పందన లభించింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు సైతం వీరికి తోడు కావడంతో ట్విట్టర్ ట్రెండింగ్ లో మోడీ రాజీనామా అంశం అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దీంతో మోడీ రాజీనామా డిమాండ్ జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఆర్.ఎస్.ఎస్ నేత రాం మాధవ్ కొలంబోలో శ్రీలంక ప్రదానమంత్రి రణిల్ విక్రమ సింఘేతో భేటీ అయ్యారనే వార్తలు చర్చనీయంశంగా మారాయి. ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక పదవి లేకపోయినా రాం మాధవ్ లంక ప్రధానితో భేటి కావటం, భారత నుంచి పెట్టుబడుల అంశం చర్చించారనే వార్తలు ఆదాని వివాదాన్ని మరింత రాజేసినట్టు కనిపిస్తోంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్