Sunday, January 19, 2025
Homeసినిమాఅఖండ విజయంపై మోహన్ బాబు ఆనందం

అఖండ విజయంపై మోహన్ బాబు ఆనందం

Mohanbabu congratulated akhanda:
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ తాజా సంచ‌ల‌నం ‘అఖండ‌’. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించిన అఖండ సినిమా టైటిల్ కి త‌గ్గ‌ట్టుగానే అఖండమైన విజ‌యం సాధించింది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది. విడుద‌లైన అన్ని కేంద్రాల్లో హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో ర‌న్ అవుతూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తుంది. బాల‌య్య అఖండ అద్భుత‌మైన విజ‌యం సాధించ‌డంతో రానున్న సినిమాలపై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. ఇండ‌స్ట్రీలో ధైర్యాన్ని ఇచ్చింది.

ఈ సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు బాల‌య్య‌ను అభినందిస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్ బాబు, విష్ణు బాల‌య్య‌ను క‌లిసి అభినందించారు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్ బాబు మాట్లాడుతూ.. సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు.. సినిమాలు చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో అఖండ విజయం సాధించిన అఖండ సినిమా, సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది, విడుదలకి సిద్దంగా ఉన్న చాలా సినిమాలకి ధైర్యాన్నిచ్చింది.

నా సోదరుడు బాలయ్యకి, ఆ చిత్ర దర్శకుడు బోయ‌పాటి శ్రీనుకి, నిర్మాత మిర్యాల ర‌వీంద్ర‌రెడ్డికి మరియు సినిమాకి పని చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులకు అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు. మంచి సినిమాని ఆదరిస్తున్న‌ ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు.. అన్నారు.

Also Read : అఖండ పరిశ్రమ విజయం : నందమూరి బాలకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్