Sunday, January 19, 2025
Homeసినిమామోక్షజ్ఞ ఎంట్రీ ఆ.. డైరెక్టర్ తో కన్ ఫర్మ్ అయ్యిందా..?

మోక్షజ్ఞ ఎంట్రీ ఆ.. డైరెక్టర్ తో కన్ ఫర్మ్ అయ్యిందా..?

మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం గురించి బాలయ్యను అడిగితే.. టైమ్ వచ్చినప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చెబుతాను అనేవారు. ఎప్పుడు వస్తాడనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే.. మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటిస్తుండడం విశేషం. ఈ మూవీ బాలయ్య మార్క్ లో ఉంటూనే అనిల్ రావిపూడి స్టైల్ లో కూడా ఉంటుందట. అయితే.. బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞను తెలుగు తెరకు హీరోగా పరిచయం చేసే బాధ్యతను అనిల్ రావిపూడికి ఇచ్చారని.. టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు లోపు బాలయ్య సినిమాని అనిల్ రావిపూడి ఫినిష్ చేస్తాడట. అక్టోబర్ తర్వాత నుంచి మోక్షజ్ఞ సినిమా పై అనిల్ రావిపూడి వర్క్ చేస్తారని సమాచారం.

అయితే… ఈ వార్త పై ఇంత వరకు ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. నిజానికి 2017లోనే తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు.  ఆ తర్వాత మోక్షజ్ఞకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం హీరో అయ్యే దిశగా మోక్షజ్ఞ కసరత్తులు చేస్తున్నాడు అనిపిస్తుంది. మోక్షజ్ఞ తొలి సినిమా దర్శకుడు అంటూ పూరి, క్రిష్, బోయపాటి శ్రీను పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే.. ప్రచారంలో ఉన్నది నిజమేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్