Wednesday, January 22, 2025
HomeసినిమాNandamuri Mokshagna: మళ్లీ వార్తల్లోకి వచ్చిన మోక్షజ్ఞ ఎంట్రీ

Nandamuri Mokshagna: మళ్లీ వార్తల్లోకి వచ్చిన మోక్షజ్ఞ ఎంట్రీ

బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. కార్యరూపం దాల్చలేదు. బాలయ్యను అడిగిన ప్రతిసారీ సమయం వచ్చినప్పుడు చెబుతానని, కథా చర్చలు జరుగుతున్నాయని చెప్పేవారు. ఒకనొక టైమ్ లో మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావడం ఇంట్రస్ట్ లేదని.. బిజినెస్ చేయాలని  అనుకుంటున్నాడని కూడా టాక్ వినిపించింది. లావుగా ఉన్న అతని లుక్ బైటకు వచ్చింది. దీన్ని ప్రచారంలో ఉన్న వార్తలు నిజమేనని భావించారు.

మోక్షజ్ఞ ఎంట్రీపై  ఓక తాజా వార్త తెలుస్తోంది. అతను  ఫారిన్ లో యాక్టింగ్ కోర్సులు చేస్తున్నాడట, దీనితో ముహుర్తం ఫిక్స్ అయ్యిందనే  టాక్ వినిపిస్తుంది.  మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను అట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మోక్షజ్ఞ హీరోగా నటించడం లేదట. బాలయ్యతో బోయపాటి చేసే అఖండ 2 సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడట. ఇదే కనుక నిజం అయితే… నందమూరి అభిమానులకు పండగే.

బాలకృష్ణ బోయపాటి కాంబో అంటేనే ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఆ సినిమాలో మోక్షజ్ఞ కూడా ఉన్నాడు అంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తే…  చూడాలని నందమూరి ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్