సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ‘సర్కారు వారి పాట’ తో సక్సెస్ సాధించారు. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం మంచి కలెక్షన్స్ రాబట్టింది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట.. ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తుండడంతో మహేష్ నెక్ట్స్ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. నెక్ట్స్ మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కావడంతో మరింత ఆసక్తి ఏర్పడింది.
ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆగష్టులో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడనే ప్రచారం కొన్ని రోజులుగా ఊపందుకుంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆ రెండు పాత్రలు ఎలా ఉంటాయి..? అని ఆరా తీయడం స్టార్ట్ చేశారు అభిమానులు. తీరా తెలిసింది ఏంటంటే… మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అనే మాటలో వాస్తవం లేదట.
అది పుకారు మాత్రమే అని.. మహేష్ బాబు సింగిల్ క్యారెక్టరే చేస్తున్నారని తెలిసింది. కాకపోతే మిగతా సినిమాలకి భిన్నంగా కనిపిస్తాడని అంటున్నారు. హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన నాయికలుగా పూజ హెగ్డే – ప్రియాంక అరుళ్ మోహన్ అలరించనున్నారు.