Sunday, January 19, 2025
HomeTrending Newsప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎంపీ కేశ‌వ‌రావు రాజీనామా

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎంపీ కేశ‌వ‌రావు రాజీనామా

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్య‌త్వానికి టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు రాజీనామా చేశారు. ఈ మేర‌కు రాజీనామా లేఖ‌ను కేశ‌వ‌రావు విడుద‌ల చేశారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ట్లు కేకే త‌న లేఖ‌లో పేర్కొన్నారు. తాను ఈ స‌భ్య‌త్వాన్ని వ‌దిలేస్తున్న‌ట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్‌కు ముందే తెలిపిన‌ట్లు కేకే పేర్కొన్నారు.

అయితే మీడియాపై, వాక్ స్వాతంత్ర్యంపై కేంద్ర ప్ర‌భుత్వం వివ‌క్ష‌త చూప‌డ‌మే కేకే రాజీనామాకు కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. కేకే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స‌భ్యులుగా ఉన్న స‌మ‌యంలో పెయిడ్ న్యూస్‌పై ముఖ్య‌మైన అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్