Sunday, January 19, 2025
Homeసినిమా'ముఖచిత్రం' ట్రైలర్ విడుదల

‘ముఖచిత్రం’ ట్రైలర్ విడుదల

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం‘. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకం పై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ… నేను తప్పా ‘కలర్ ఫొటో’ చిత్రానికి పని చేసిన వాళ్లందరూ ఈ సినిమాలో ఉన్నారు. సందీప్ రాజ్ మరోసారి ఓ క్లాసిక్ మూవీ చేశాడని ఆశిస్తున్నాను. దర్శకుడు గంగాధర్ కు ఆల్ ద బెస్ట్ అన్నారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ…. మంచి వాయిస్ ఉన్న క్యారెక్టర్ ను ఈ సినిమాలో చేశాను. ‘ముఖ చిత్రం’ షూటింగ్ చేస్తున్న రెండు రోజులు ఒక వైబ్రేషన్ లో ఉండిపోయాను. మూవీ కంటెంట్ కొంత చూసినప్పుడు ఈ చిత్రంలో పార్ట్ అవ్వాలి అనిపించింది. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ప్రొడ్యూసర్ గా ఎలాంటి కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. ఇప్పుడు ‘దమ్కీ’ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా మరోసారి ఆ కష్టాలు తెలిసొచ్చాయి. ఈ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

సందీప్ రాజ్ మాట్లాడుతూ… ఈ సినిమాను పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. సంగీత దర్శకుడు కాలభైరవ లేకుంటే నేను దర్శకుడినే అయ్యేవాడిని కాదు. అతను నాకు బిగ్ సపోర్ట్. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ చేశాడు. ఒక మంచి సినిమా ఇది. మీ అందరి సపోర్ట్ కావాలి. విశ్వక్ సేన్ గురించి మాట్లాడటం మొదలుపెడితే సినిమాలో అతని రన్ టైమ్ కన్నా ఎక్కువ సేపు మాట్లాడాలి. మూవీలో పార్ట్ అయిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు.

Also Read : థమన్ చేతుల మీదుగా ‘ముఖచిత్రం’ లిరికల్ సాంగ్ రిలీజ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్