Sunday, January 19, 2025
HomeTrending NewsLB Nagar Fly Over : ఫ్లై ఓవర్ ఘటన దురదృష్టకరం - కేటిఆర్

LB Nagar Fly Over : ఫ్లై ఓవర్ ఘటన దురదృష్టకరం – కేటిఆర్

హైదరాబాద్ నగరంలో ఎల్బీనగర్ – బైరామల్ గూడ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, వారి యోగక్షేమలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గాయపడిన వారికి పూర్తి అండగా ఉంటుందని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.

జరిగిన ఘటన దురదృష్టకరమన్న కేటీఆర్, ఈ ప్రమాదం పట్ల పురపాలక శాఖ పూర్తిస్థాయి విచారణ చేపడుతుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన అంశాలపైన జిహెచ్ఎంసి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో ముగ్గురితో కూడిన కమిటీకి అదనంగా జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విచారణ చేయించి, ప్రమాద కారణాలను తెలుసుకుంటామన్నారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగితే, కఠిన చర్యలు సైతం తీసుకుంటామన్నారు.

మంత్రి కేటీఆర్ వెంట నగర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పురపాలక శాఖ అరవింద్ కుమార్, ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్