Saturday, January 18, 2025
HomeTrending Newsకాంగ్రెస్,బిజెపిలకు మునుగోడుతో గుణపాఠం - తలసాని

కాంగ్రెస్,బిజెపిలకు మునుగోడుతో గుణపాఠం – తలసాని

కుళ్ళు, కుతంత్రాలు చేసి మునుగోడ్ ఉప ఎన్నికలలో గెలవాలని చూస్తున్న BJP, కాంగ్రెస్ లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని హెచ్చరించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్ లో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, MLC ఎగ్గే మల్లేశం, MLA లు జైపాల్ యాదవ్, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మునుగోడ్ నియోజకవర్గ అభివృద్ధి TRS ప్రభుత్వంతోనే సాధ్యం అన్నారు. మునుగోడ్ ప్రజల ఎన్నో సంవత్సరాల ప్రధాన సమస్య ప్లోరిన్ నుండి శాశ్వతంగా విముక్తి కల్పించిన చరిత్ర TRS ప్రభుత్వానిదే అన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా BJP, కాంగ్రెస్ నేతలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని, ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలవాలని దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

మేం గెలిస్తే 3 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్తున్న BJP నేతలు వారు MLA గా గెలిచిన దుబ్బాక, హుజారాబాద్ లలో ఏడాది గడిచినా ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పాడు పడుతుంటే, BJP పార్టీ నాయకులు వారి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, ఇది నీచపు రాజకీయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెల యూనిట్ల కు బదులు నేరుగా లబ్దిదారుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తే, BJP నేతలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు పిర్యాదు చేసి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని చెప్పారు. BJP నేతలు చేసిన పిర్యాదుతోనే ఎన్నికల సంఘం కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. లబ్దిదారులు అదైర్యపడొద్దని, ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన తర్వాత యదావిధిగా కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. BJP నేతలు కేవలం ఎన్నికలు ముగిసే వరకు మాత్రమే అడ్డుకోగలరని, ఆ తర్వాత ఏం చేయలేరని అన్నారు.

ప్రజాస్వామ్యంలో చిల్లర రాజకీయాలు కుదరవు అన్నారు. కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకురావడం చేతకాని BJP నేతలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు BJP నేతలు పిర్యాదులు చేస్తూ ప్రభుత్వ పథకాల అమలును అడ్డుకుంటుండగా, BJP అభ్యర్ధి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి నా ఇల్లు అమ్మి గొర్రెలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్ట్ రావడం వలనే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. మూడున్నర సంవత్సరాలలో MLA గా ఉన్న నువ్వు నియోజకవర్గ అభివృద్దికి ఏం చేశారో రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రైతుబందు, దళిత బందు ఎన్నికల కోసం తెచ్చిన పథకాలు కావన్నారు. నాలుగు ఓట్ల కోసం BJP నాయకులు ఏది పడితే అది మాట్లాడేస్తారని విమర్శించారు.

Also Read : మునుగోడు అభివృద్ది టీఆర్‌ఎస్‌ తోనే సాధ్యం : మంత్రి ఎర్రబెల్లి  

RELATED ARTICLES

Most Popular

న్యూస్