Wednesday, November 27, 2024
HomeTrending Newsమునుగోడులో మధ్యాహ్నం వరకు 41 శాతం పోలింగ్

మునుగోడులో మధ్యాహ్నం వరకు 41 శాతం పోలింగ్

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడించారు. ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈవీఎం మెషిన్‌లో లోపం కారణంగా చిన్నకొండూరు గ్రామ ఓటర్లు పోలింగ్‌ పునఃప్రారంభం కోసం నేలపైనే కూర్చుండి పోయారు. మధ్యాహ్నం ఒకటింటి వరకు 41.3 శాతం పోలింగ్ నమోదైంది.

తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫిర్యాదుపై ఈసీతో మాట్లాడినట్లు సీఈవో తెలిపారు. ఫిర్యాదు వచ్చిన సామాజిక మాధ్యమాల లింకుల ద్వారా విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగినట్లు చెప్పారు. పోలీసులు వెంటనే కలగజేసుకొని ఆందోళనకారులను చెదరగొట్టారన్నారు. అదేవిధంగా మునుగోడులో మూడు చోట్ల ఈవీఎంల సమస్య తలెత్తినట్లు సీఈవో తెలిపారు. మరోచోట 20 ఓట్లు పడ్డాక ఈవీఎం మొరాయించడంతో రీప్లేస్‌ చేసినట్లు చెప్పారు. ఈవీఎం సమస్యలను ఎప్పటికప్పుడు సరిచేస్తున్నట్లు వివరించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో స్థానికేతరులు ఉన్నారనే, పోలింగ్‌ కేంద్రాల వద్ద గుర్తులు ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులపై తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలీసులు ఇప్పటి వరకు 42 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపించినట్లు చెప్పారు.

మరోవైపు మునుగోడు నియోజకవర్గంకు బాటపట్టిన హైదరాబాదులో నివాసముంటున్న ఓటర్లు. ఓటేసేందుకు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్న ఓటర్లు. కుటుంబంతో కలిసి కార్లు, టూ వీలర్లలో తరపుతున్న ఓటర్లు. దీంతో చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు వెళ్లే రహదారి రద్దీగా మారింది.

Also Read : మునుగోడులో పోలింగ్ ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్