Sunday, January 19, 2025
HomeTrending Newsపెన్షన్లతో డబుల్ ఇంజిన్లకు ట్రబుల్ - మంత్రి జగదీష్ రెడ్డి

పెన్షన్లతో డబుల్ ఇంజిన్లకు ట్రబుల్ – మంత్రి జగదీష్ రెడ్డి

25 ఏండ్లుగా బిజెపి ఎలుబడిలో ఉన్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్దులకు ఇచ్చే ఫించన్ కేవలం 750 రూపాయలు మాత్రమేనని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో వికలాంగులకు ఇచ్చే ఫించన్ 600 రూపాయలు మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రలలో మొదటిది ఈ దేశంలో పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అటు వృద్దులు, వితంతువులతో పాటు వికలాంగులకు ఇచ్చే ఫించన్ మొత్తం కూడ అక్షరాల 600 రూపాయలు మాత్రమే నన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన నూతన ఫింఛన్లను సూర్యాపేట పురపాలక సంఘం, సూర్యాపేట రూరల్ లలో లబ్దిదారులకు శనివారం ఆయన అందజేశారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… అదే బీజేపీ రెండు దశాబ్దాలుగా పాలిస్తున్న మధ్యప్రదేశ్ లో అందరికి సర్వ సమానంగా 600 రూపాయలు ఫింఛన్ల పేరు మీద విదిలిస్తుండగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ దొడ్డి దోవన అధికారంలోకి వచ్చిన కర్ణాటక లోను ఇచ్చే ఫించన్ 600 మాత్రమేనని ఆయన ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రాంతంలోనూ రాష్ట్రం ఏర్పాటుకు ముందు సాలీనా 800 కోట్లు ఇస్తుండగా రాష్ట్రం ఆవిర్భావం తరువాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఫింఛన్ల పేరుతో సాలీనా 12,000 కోట్లు చెల్లిస్తుందన్నారు.

డబుల్ ఇంజిన్ల పేరుతో రాజకీయం వెలగ బెడుతున్న కమలనాధులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఫించన్లే ట్రబుల్ ఇస్తున్నాయని మంత్రి ఎద్దేవాచేశారు. ఈ ఫింఛన్లతోటే బిజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ తిరుగుబాటు సంభవిస్తుందో నన్న మీమాంస వారిని వెంటాడుతున్నట్లుందన్నారు. అందుకే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రం కిందా మీద పడుతుందని ఆయన దుయ్యబట్టారు. బ్యాంకుల నుండి రుణాలు మంజూరు కాకుండా అడ్డుకోవడం, కేంద్రం ఇవ్వాల్సిన నిధులను ఇవ్వక పోవడం,రాష్ట్రం నుండి ముక్కు పిండి వసూలు చేసిన పన్నులు తిరిగి రాష్ట్రానికి అందించకుండా మొకలడ్డుతున్నారని ఆయన మండిపడ్డారు. అయినా వెనక్కి తగ్గకుండా కొత్తగా మంజూరు అయిన 10 లక్షల ఫించన్లను కలుపుకుని మొత్తం తెలంగాణలో46 లక్షల మంది లబ్దిదారులకు ఫించన్లు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. కొత్తగా మంజూరు అయిన ఫింఛన్ల తో కలుపుకుని ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 38068 మంది లబ్ధిదారులు ఉండగా నెలకు 9.1 కోట్లు సాలీనా 108 కోట్లు చెలిస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించారు.

తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో సరఫరా అవుతున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్ కూడా బిజెపి పాలకులకు కంటగింపుగా మారిందన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంట్ సరఫరా కేవలం ఆరు గంటల మాత్రమే నన్నారు.అక్కడ అరనిమిషం కుడా ఉచిత విద్యుత్ ఇవ్వక పోగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రీడింగ్ ప్రకారమే రైతాంగం నుండి ముక్కు పిండి మరీ విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు.ఎగిరెగిరి పడుతున్న ఈ బిజెపి పాలనలోనే కదా ఎక్కడో 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా 1100 పై చిలుకు ఎగబాకిందని ఆయన తెలిపారు. డీజిల్ ఇటు పెట్రోల్ ధరల పెరుగుదల కు హద్దు అనేది లేకుండా పోయిందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.

Also Read : కేంద్రం దేశద్రోహపూరిత చర్య జగదీష్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్