Saturday, January 18, 2025
Homeసినిమాజూలై 15న ప్రభుదేవా మై డియర్ భూతం

జూలై 15న ప్రభుదేవా మై డియర్ భూతం

Bhootam: టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్‌గా సుపరిచితమైన  ప్రభుదేవా…. ఈ ఫేమ్ కంటిన్యూ చేస్తూనే హీరోగా, దర్శకుడిగా తన టాలెంట్  తో ప్రశంసలందుకున్నారు. మరోవైపు నిర్మాతగా కూడా పలు సూపర్ హిట్స్ అందించారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా తాజా చిత్రం ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సినిమాలోని అడ్వెంచర్ సీన్స్, గ్రాఫిక్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయట. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

తాజాగా చిత్ర రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్.  జూలై15వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రమని దర్శకనిర్మాతలు చెప్పారు. చక్కని అవుట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఈ మూవీ ప్రభుదేవా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మై డియర్ భూతం మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సాంగ్, పోస్టర్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్