Sunday, January 19, 2025
Homeసినిమాసంక్రాంతికి సినిమాలు లేవనే కొరతను ‘హీరో’ తీరుస్తుంది: ఆదిశేషగిరి రావు

సంక్రాంతికి సినిమాలు లేవనే కొరతను ‘హీరో’ తీరుస్తుంది: ఆదిశేషగిరి రావు

Hero Coming: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ఈ రోజు మనం అశోక్ గురించి మాట్లాడాలి. అతని గురించి ఎవ్వరికీ తెలియదు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి గల్లా జయదేవ్ పార్లమెంట్ సభ్యుడిగా పదేళ్ల నుంచి వేసిన ముద్ర అందరికీ తెలిసిందే. ఆయన నానమ్మ గల్లా అరుణ గారు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఆమె తండ్రి రాజగోపాల్ నాయుడు గారు యాభై ఏళ్ల క్రితమే పార్లమెంట్ సభ్యుడు. ఇండస్ట్రీయల్‌గా అభివృద్ది చేద్దామని అమెరికా నుంచి ఇక్కడకు వచ్చారు. అనంతపూర్ జిల్లాలో ఎన్నో పరిశ్రమలు పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చారు.

సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనళ్లుడిగా ఇవాళ సినీ పరిశ్రమకు వచ్చారు. కృష్ణ గారి ‘పచ్చని సంసారం’లో చైల్డ్ ఆర్టిస్ట్‌ గా నటించాడు. అప్పటినుంచే నటించాలనే కోరిక పుట్టినట్టుంది. అందరూ సహకరించి.. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను పెట్టారు. సినిమాలో చిన్న చిన్న గ్లింప్స్ చూశాను. స్టార్స్‌ కు ఉండాల్సిన లక్షణాలున్నాయి. డ్యాన్స్, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్, సెన్సాఫ్ హ్యూమర్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నీ ఉన్నాయి. మాస్ హీరోకు ఉండే లక్షణాలన్నీ కూడా పుణికి పుచ్చుకున్నాడు. ఆదిత్య అద్భుతంగా తెరకెక్కించాడు. కాన్ఫిడెంట్‌గా సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కృష్ణ గారు, మహేష్ బాబు కూడా సంక్రాంతికి ఎన్నోసినిమాలను విడుదల చేశారు. ఇప్పుడు అశోక్ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్ గారు అందరూ నటించారు. టికెట్ రేట్ల అంశం గురించి కావాలంటే ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి మాట్లాడతాను. ఈ సినిమాకు సంబంధించి కృష్ణ గారు జనవరి 15న వెళ్తే బాగుంటుందని అన్నారు. నెలక్రితమే ఆ విషయం చెప్పారు. కానీ పెద్ద సినిమాలున్నాయ్ ఎలా? అని పద్మావతి, మేం అనుకున్నాం. అందరూ కలిసి ఈ సినిమాను జనవరి 15న తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. సినిమాలో కంటెంట్ ఉంటే సంక్రాంతికి రెండు మూడు చిత్రాలు వచ్చినా కూడా నిలబడతాయి. అందుకే ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నాం. సంక్రాంతికి సినిమాలు లేవనే కొరతను తీర్చేందుకు ఈ సినిమా రాబోతోంది’ అని అన్నారు.

అశోక్ గల్లా మాట్లాడుతూ.. నా కల నిజమవుతున్నట్టు అనిపిస్తోంది. సంక్రాంతికి రాబోతోన్నామని తెలిసినప్పటి నుంచి మా ఎనర్జీ వేరే లెవెల్‌కి వెళ్లింది. పాటను రిలీజ్ చేశాక.. తాతగారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, నార్మల్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమాను పండుగకు తీసుకురావాలని అనుకున్నాం. మేం ఎంత ఎంజాయ్ చేస్తూ సినిమాను తీశామో.. ఆడియెన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తే మా టార్గెట్ రీచ్ అయినట్టే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినప్పుడే నాకు నటన మీద ఇంట్రెస్ట్ పుట్టింది. సినిమా చేసేటప్పుడు ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదు. కానీ విడుదల రోజు మాత్రం ప్రెజర్ ఉంటుంది. ఈ సినిమాలో కృష్ణ గారు, మహేష్ బాబు గారు ఎలాంటి ప్రత్యేక పాత్రలో కనిపించరు అని అన్నారు.

Also Read : అశోక్ గల్లా ‘హీరో’ నుంచి ‘డోనల్ డగ్గు’ ర్యాప్ సాంగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్