Saturday, January 18, 2025
HomeసినిమాNaa Saami Ranga: 'నా సామి రంగ'.. ఎక్స్ క్లూజీవ్ న్యూస్

Naa Saami Ranga: ‘నా సామి రంగ’.. ఎక్స్ క్లూజీవ్ న్యూస్

అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ సినిమా తర్వాత చాలా కథలు విని.. ఆఖరికి ‘నా సామి రంగ’ అనే సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ మూవీని నాగార్జున పుట్టినరోజున అనౌన్స్ చేశారు. టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అంతే కాకుండా.. ఈసారి పండక్కి నా సామి రంగ అంటూ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇటీవల కీరవాణి సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్ చేశారు. ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు మరి.. సంక్రాంతికి రావడం కుదురుతుందా..? లేక వాయిదా పడుతుందా..? అని కూడా వార్తలు వచ్చాయి.

అయితే.. నాగార్జున సెంటిమెంట్ గా నాన్న అక్కినేని 100వ జయంతి రోజున ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చారు. నాగార్జున పై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. ఈ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జునతో పాటు యంగ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌ కూడా నటిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోలకు ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు హీరోయిన్స్ అంటే.. ఆషికా రంగనాథ్, అనన్య నాగళ్ల, అవికా గోర్ అని సమాచారం.

ఎట్టి పరిస్థితుల్లోనూ నా సామి రంగ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. అందర్నీఆకట్టుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. ఈ సెంటిమెంట్ ప్రకారం.. నా సామి రంగ చిత్రం కూడా సంక్రాంతికి రావాలి.. పెద్ద సక్సెస్ సాధించాలి. మళ్లీ ఫామ్ లోకి రావాలి అని నాగ్ ఆలోచన. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కి ఎలాంటి బ్రేక్ లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి.. నా సామి రంగ బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్