Sunday, January 19, 2025
HomeTrending Newsఏపీ కార్యక్రమాలు భేష్: నాబార్డు ఛైర్మన్

ఏపీ కార్యక్రమాలు భేష్: నాబార్డు ఛైర్మన్

నాబార్డ్ సాయంతో చేపడుతున్న విద్యారంగంలో మనబడి నాడు-నేడు, కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలో  అమలు చేస్తోన్న కార్యక్రమాలు సమర్ధవంతంగా కొనసాగుతున్నాయని నాబార్డ్‌ చైర్మన్‌ షాజి. కే.వీ. కితాబిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో షాజి, నాబార్డ్‌ ప్రతినిధుల బృందం కలుసుకున్నారు.  నాబార్డ్ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు పై సమావేశంలో చర్చ జరిగింది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో నాబార్డ్ సాయంతో చేపడుతున్న  కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు నడుస్తున్నాయని సిఎం జగన్ వారికి వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లోనూ.. మహిళా సంక్షేమంలోనూ చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపర్చడమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తున్నాయన్న చెప్పారు. నాబార్డు అందిస్తున్న సాయంపై ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా తోడ్పాటును అందించాలని నాబార్డ్ చైర్మన్ ను సిఎం జగన్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్