Tuesday, December 24, 2024
Homeసినిమానభా నటేశ్ నల్లపూసైపోయిందే!

నభా నటేశ్ నల్లపూసైపోయిందే!

Nabha: అందంగా ఉన్న వాళ్లంతా సినిమాల్లో కథానాయికలు కాలేరు .. కథానాయికలు అయిన వాళ్లంతా అగ్రస్థానానికి చేరుకోలేరు. సినిమాల్లో ప్రవేశానికి అందం ప్రధానమైన అర్హతనే అయినప్పటికీ, ఒకింత అభినయం కూడా తెలిసి ఉండవలసిందే. ఇక అవకాశాలు వెతుక్కుంటూ రావాలంటే లౌక్యం కూడా ఉండవలసిందే. అందం చుట్టూ వైఫై మాదిరిగా చుట్టూ ఇవన్నీ ఉన్నప్పుడే స్టార్ డమ్ తెచ్చుకోవడం సాధ్యమవుతుంది. లౌక్యం లేనప్పుడు ఏ భాషలోకి అడుగుపెట్టినా పరిస్థితి ఒకటేలా ఉంటుందనే విషయం కొంతమంది కథానాయికల కెరియర్ ను చూస్తే అర్థమవుతుంది.

కొంతమంది కథానాయికలు ఎంత ఫాస్టుగా తమ గ్రాఫ్ పెంచుకుంటూ వస్తారో .. అంతే ఫాస్టుగా కనిపించకుండా పోతుంటారు. అవసరమైనంత అభినయం ఉంటుంది .. అంతకుమించిన అందాల ఆరబోత ఉంటుంది. అయినా నిలబడలేక నానా ఇబ్బందులు పడిపోయి, చివరికి కనిపించకుండా పోతుంటారు. అలాంటి కథనాయికలలో నభా నటేశ్ ఒకరిగా కనిపిస్తుంది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకి ఈ అమ్మాయి పరిచయమైంది. తెరపై నభాను చూడగానే, నేరేడుపళ్ల వంటి కళ్లేసుకుని, గుమ్మడి పువ్వులా ఉందే అనుకున్నారు.

ఆ తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఎలాంటి మొహమాటాలు లేకుండా నభా అందాల సందడి చేసింది. ఆమె అందాల తాకిడికి కుర్రాళ్లంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ భారీ అందాల భామకు ఇక ఢోకా లేదనుకున్నారు. కానీ ఆ తరువాత ఆమె చేసిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. మాస్ కంటెంట్ .. గ్లామర్ డోస్ ఇవేవీ ఆమె సక్సెస్ గ్రాఫ్ ను పెంచలేకపోయాయి. అలా నాలుగు సినిమాలు నిరాశపరచడంతో, కనుచూపుమేరలో ఈ సుందరి కనిపించడం లేదు. అందం .. అభినయంతో పాటు లౌక్యం కూడా ఉండాలని అందుకే అంటారు మరి. ఆ లౌక్యమే ఉంటే అందాల భామ సినిమాలు ఓ అరడజను సెట్స్ పై ఉండేవే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్