Saturday, February 22, 2025
Homeసినిమాహెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుకు  నాగబాబు సాయం 

హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుకు  నాగబాబు సాయం 

Nagababu Help: హెయిర్ డ్రెస్సెర్ ఉప్పలపు నాగ శ్రీను ప్రస్తుతం కష్టకాలం లో ఉన్నాడు. అతని తల్లి ఆరోగ్యం మరింత క్షీణించడం, అతనికి గత సంస్థ నుండి జీతం కూడా సరిగ్గా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాడు. అతని ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని నటుడు నిర్మాత నాగబాబు హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుకు చిరు సాయంగా 50,000/- రూపాయలు అందించడం జరిగింది.

అలాగే నాగ శ్రీను చిన్నారులు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారికి ఎటువంటి సమస్య లేకుండా పూర్తి వైద్య సహాయం కోసం అపోలో ఆసుపత్రి నందు వారికి ఫ్రీ మెడికల్ చెకప్ చేసే సకల ఏర్పాట్లకు నాగబాబు అతని కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి ఆపద వచ్చినా వెంట‌నే స్పందించే నాగబాబు గారి సహాయానికి హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీను కుటుంబం కృతఙ్ఞతలు తెలిపింది.

కొంతకాలం క్రితం వరకూ మంచు కుటుంబం వద్ద హెయిర్ డ్రెస్సర్ గా పని చేశాడు. మంచు విష్ణు తనను దుర్భాషలదాడంతూ వార్తల్లోకి ఎక్కాడు. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అయ్యింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్