Saturday, January 18, 2025
Homeసినిమానేడు నాగచైతన్య - శోభితల ఎంగేజ్మెంట్

నేడు నాగచైతన్య – శోభితల ఎంగేజ్మెంట్

హీరో అక్కినేని నాగచైతన్య- హీరోయిన్ శోభితా దుళిపాళ్లల ఎంగేజ్మెంట్ నేడు జరగనుంది. నాగార్జున నివాసంలో కేవలం కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వేడుక నిర్వహిస్తున్నారు.

2010లో వచ్చిన  ‘ఏం మాయ చేశావే’ సినిమాలో కలిసి నటించిన నాగ చైతన్య- సమంత ప్రేమలో పడ్డారు. ఏడేళ్ళ ప్రేమాయణం తరువాత 2017 అక్టోబర్ 6న ఇద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మూడేళ్ళపాటు వీరి బంధం అన్యోన్యంగా సాగింది. ఆ తర్వాత  బేధాభిప్రాయాలు మొదలై 2021 అక్టోబర్ 2 న వారి విడాకుల విషయాన్ని ఇద్దరూ సంయుక్తంగా ప్రకటించారు.

మరోవైపు, తెనాలిలో జన్మించిన శోభిత దుళిపాళ్ల నటిగా హిందీలో ఆరంగ్రేటం చేసి తెలుగులో అడివి శేష్ రూపొందించిన గూఢచారి, మేజర్ సినిమాలతో పాటు మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు సుపరిచయమైంది.

నాగచైతన్య  – హీరోయిన్ శోభిత ధూళిపాళ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విదేశాల్లో వారిరువురూ కలిసి ఉన్న పలు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నేటి వివాహ నిశ్చితార్థంతో వారిద్దరూ సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్