Tuesday, February 27, 2024
Homeసినిమామనల్ని మనమే కించపరచుకోవటం: నాగ చైతన్య, అఖిల్

మనల్ని మనమే కించపరచుకోవటం: నాగ చైతన్య, అఖిల్

వీర సింహారెడ్డి సినిమా విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ చేసిన ‘అక్కినేని తోక్కినేని’ వ్యాఖ్యలపై అక్కినేని వారసులు, వర్ధమాన హీరోలు నాగ చైతన్య, అఖిల్ స్పందించారు.

“నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవ పరచటం మనల్ని మనమే కించపరచుకోవటం.” అంటూ నాగ చైతన్య, అఖిల్ ట్వీట్ చేశారు.

#ANRLiveson అనే హ్యాష్ ట్యాగ్ తో ఒకే సందేశాని ఇద్దరూ పోస్ట్ చేయడం విశేషం.

ఆదివారంనాడు హైదరాబాద్ లో జరిగిన సభలో  బాలయ్య మట్లాడుతున్న సమయంలో ఓ సహా నటుణ్ణి పరిచయం చేశారు. షూటింగ్ సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు ఎన్నో అంశాలు తామిద్దరం చర్చించుకునే వాళ్ళమని, నాన్నగారు, ఆ డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తోక్కినేని అని మాట్లాడుకునే వాళ్ళమని యధాలాపంగా బాలకృష్ణ అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్