Saturday, January 18, 2025
Homeసినిమారూటు మార్చిన నాగ‌చైతన్య‌

రూటు మార్చిన నాగ‌చైతన్య‌

మ‌జిలీ, వెంకీమామ‌, ల‌వ్ స్టోరీ, బంగార్రాజు.. ఇలా వ‌రుస‌గా స‌క్సెస్ సాధించి జోష్ మీదున్న అక్కినేని నాగ‌చైత‌న్యకు థ్యాంక్యూ, లాల్ సింగ్ చ‌డ్డా సినిమాలు ప్లాప్ అవ్వడం షాక్ అని చెప్ప‌చ్చు. దీంతో క‌థ‌ల విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఎవరికైనా రేసులో వెనుకబడినప్పుడే భయం వేస్తుంది. ముందుకెళ్లేందుకు ఏమి చెయ్యాలా అని తర్జన భర్జన పడుతుంటారు. ఇప్పుడు నాగ‌చైత‌న్య ఇదే ప‌రిస్థితుల్లో ఉన్నాడు.

నాగ‌చైత‌న్య‌ తన సినిమాలకు పబ్లిసిటీ వంటివి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. సినిమా విడుదల అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చి, ఈవెంట్ లకు అటెండ్ అయి మమ అనిపించేవాడు కానీ.. రెండు సినిమాలు ఫ్లాప్ కావడం ఇతర హీరోలు దూసుకుపోతుండడంతో నాగ చైతన్య కూడా మారిపోయాడు ఇప్పుడు. థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా.. సినిమాలు అపజయం పాలయ్యాక ఇప్పుడు పబ్లిసిటీ అవసరం అనుకుంటున్నాడు.

కొత్త సినిమాకి స్టార్టింగ్ నుంచే ఎలా ప్రోమోట్ చెయ్యాలనే విషయంలో ఆలోచిస్తున్నాడట. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. ఈ సినిమాకి ముందు నుంచే హైప్ వచ్చేలా రెడీ అవుతున్నాడట. నాగ చైతన్య సోషల్ మీడియాలో ఉన్నాడు కానీ చాలా తక్కువగా వాడుతాడు. ఇక పై సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండాలనుకుంటున్నాడట. మ‌రి.. చైత‌న్య‌లో వ‌చ్చిన మార్పు త‌న కెరీర్ కి ఎంత వ‌ర‌కు హెల్ప్ అవుతుందో చూడాలి.

Also Read :  చైత‌న్య ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్