Friday, May 31, 2024
HomeసినిమాNaga Chaitanya: ఆ సినిమా ఆడదని ముందే తెలిసింది - నాగచైతన్య

Naga Chaitanya: ఆ సినిమా ఆడదని ముందే తెలిసింది – నాగచైతన్య

నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్ లో రూపొందిన చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తే.. అరవింద్ స్వామి విలన్ పాత్ర పోషించడం విశేషం. ఒక సామాన్య కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య నటించాడు. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో నాగచైతన్య పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇంతకీ ఏం చెప్పాడంటే.. ‘థ్యాంక్యూ’ సినిమా ఫ్లాప్ అవుతుందని ఎడిటింగ్ రూమ్ లోనే తెలిసిపోయిందని అసలు విషయం బయటపెట్టాడు. ఈ సినిమా కథ నచ్చింది. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. అయితే.. షూటింగ్ కంప్లీట్ అయి ఎడిటింగ్ రూమ్ దగ్గరకి వచ్చినప్పుడు ఇదేదో తేడా కొడుతుంది అనిపించింది కానీ.. ఏం చేయలేం. ఎవర్నీ తప్పు బట్టలేమన్నారు. అయితే.. కస్టడీ సినిమా పై మాత్రం చాలా నమ్మకంగా ఉన్నానని చెప్పారు.

సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ అనేది లేకుండా ఇంట్రస్టింగ్ గా ఉండేలా వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ్ లో ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్నాను. అది ఇప్పటికి కుదిరింది. ట్రైలర్ కు తెలుగుతో పాటు తమిళ్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఇటు తెలుగు, అటు తమిళ్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే.. కథ విన్నప్పుడే ఇది హిట్ సినిమా అనే ఫీలింగ్ కలిగిందన్నారు. మరి.. నాగచైతన్యకు కస్టడీ మూవీ ఎలాంటి రిజెల్ట్ అందిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్