Saturday, January 18, 2025
Homeసినిమానాగ‌చైత‌న్య మూవీ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?

నాగ‌చైత‌న్య మూవీ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో ‘NC22‘ గా తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అత్యున్నత నటీనటులు సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ రీసెంట్‌గా మైసూర్‌లో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. నాగ చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.  పూర్తిగా భిన్నమైన అవతార్‌లో చైతూ  కనిపించనున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్ ఎస్ఆర్ కతీర్ ఈ చిత్రానికి కెమరామెన్ గా పని చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్