Monday, February 24, 2025
Homeసినిమానెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన 'రంగబలి'

నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన ‘రంగబలి’

నాగశౌర్యకి కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. అలాంటి ఒక హిట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన ఆయన, ‘రంగబలి’ సినిమా చేశాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో యుక్తి తరేజా అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయమైంది. జులై 7వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఆ సినిమా ఈ రోజు నుంచి ‘నెట్ ఫ్లిక్స్’ లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో ఈ సినిమాను చూడలేకపోయిన వారు, ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై చూడొచ్చు.

‘రంగబలి’ కథ విషయానికొస్తే హీరో .. హీరోయిన్ ను ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. తాను మిడిల్ క్లాస్ కుర్రాడే అయినా .. ఆ అమ్మాయి శ్రీమంతుల ఫ్యామిలీ నుంచి వచ్చిందని తెలిసినా భయపడడు. నేరుగా ఆమె తండ్రి దగ్గరికి వెళ్లి, ఆయన కూతురుతో సాగుతున్న తన లవ్ మేటర్ చెబుతాడు. తమకి పెళ్లి జరిపించమని అడుగుతాడు. అతనిది ఏ ఊరు అనేది తెలుసుకున్న ఆమె తండ్రి, ఆ ఊరు వదిలి వస్తేనే తప్ప తన కూతురును ఇవ్వనని తేల్చి చెబుతాడు.

అప్పుడు హీరో తన ఊరు గురించి .. తన ఊళ్లోని ‘రంగబలి’ సెంటర్ గురించి తెలుసుకోవడం మొదలుపెడతాడు. అతను తెలుసుకునే ఆ నిజాలు ఏమిటనే అంశాలతో ఈ కథ ఆసక్తికరంగా నడుస్తుంది. నాగశౌర్య యాక్షన్ .. సత్య కామెడీ .. యుక్తి గ్లామర్ .. షైన్ టామ్ చాకో విలనిజం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సరదాగా చూడవలసిన సినిమా.  నిజానికి ఇది నాగశౌర్య కి హిట్ తెచ్చిపెట్టవలసిన సినిమా. ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్