Sunday, January 19, 2025
Homeసినిమానాగ్ తో బుట్టబొమ్మ రొమాన్స్

నాగ్ తో బుట్టబొమ్మ రొమాన్స్

బుట్టబొమ్మ అనగానే ఠక్కున గుర్తొచ్చేది క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే. ఈ అమ్మడు స్టార్ హీరోలు ప్రభాస్ తో రాధేశ్యామ్, అల్లు అర్జున్ తో అల.. వైకుంఠపురములో, మహేష్‌ బాబుతో మహర్షి, ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జునతో రొమాన్స్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కింగ్ నాగార్జునతో బుట్టబొమ్మ పూజాహెగ్డే కలిసి పని చేసిందా?  ఇద్దరు సైలెంట్ గా షూట్ పూర్తి చేసి సర్ ప్రైజ్ చేస్తున్నారా?  అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

మరి ఇద్దరు ఏ సినిమాలో జంటగా నటించినట్లు? అంటే ఈ కాంబో చేతులు కలిపింది సినిమా కోసం కాదట. ఓ కమర్శియల్ యాడ్ కోసం అని తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఈ యాడ్ షూట్ జరిగిందట. దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసిన అభిమానులు ఇదేం సర్ ప్రైజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదొక  ఫ్రూట్ జ్యూస్ డ్రింక్ యాడ్. ఈ యాడ్ లో నాగార్జున -పూజా హెగ్డే భిన్నంగా కనిపిస్తారట. త్వరలోనే ఈ యాడ్ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

నాగార్జున  చాలా కాలంగా  కమర్షియల్స్  చేస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన సినిమాల కన్నా ఎక్కువగా యాడ్స్ చేస్తున్నారు. ఇక నటిగా పాపులర్ అయిన తర్వాత పూజాహెగ్డే కమర్శియల్స్ బాగానే చేస్తోంది. ఈ అమ్మడు నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ తోనూ రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. చైతన్యతో ఒక లైలా కోసం, అఖిల్ తో మోస్ట్ ఎలిచిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేసింది. తాజాగా కింగ్ తో యాడ్ లోనూ కలిసి నటించింది. ఈ రకంగా ఈ అమ్మడు అక్కినేని హీరోలందరితో రొమాన్స్ చేసింది. మరి.. నాగార్జునతో కూడా సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్