Sunday, January 19, 2025
Homeసినిమానాగ్ 100వ చిత్రం ఏమైంది..?

నాగ్ 100వ చిత్రం ఏమైంది..?

నాగార్జున 100 వ చిత్రం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. 100వ చిత్రం గురించి ఎప్పుడు అడిగినా… అదొక నెంబర్ మాత్రమే అని.. నా లెక్క నాకు ఉందని.. మంచి కథ సెట్ అయిన తర్వాత 100వ చిత్రం గురించి ప్రకటిస్తానని నాగార్జున చెప్పేవారు. అయితే.. అక్కినేని అభిమానులతో పాటుగా సాధారణ సినీ అభిమానులు సైతం నాగార్జున మైల్ స్టోన్ మూవీ అనౌన్స్ మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల నాగార్జున 100వ చిత్రం దర్శకులు అంటూ రాఘవేంద్రరావు, చందు మొండేటి, మోహనరాజా పేర్లు వినిపించాయి. మోహనరాజాతో నాగార్జున 100వ చిత్రం కన్ ఫర్మ్ అని గట్టిగా ప్రచారం జరిగింది. మోహనరాజా కూడా కన్ ఫర్మ్ చేయడంతో ‘గాడ్ ఫాదర్’ మూవీ తర్వాత ఈ సినిమాని ప్రకటిస్తారని అనుకున్నారు. నాగార్జున కూడా ‘ది ఘోస్ట్’ మూవీ రిలీజ్ తర్వాత మోహనరాజాతో మూవీని ప్రకటించాలి అనుకున్నారు. అయితే.. ది ఘోస్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో బాగా అప్ సెట్ అయిన నాగార్జున 100వ సినిమా విషయంలో మరింతగా ఆలోచిస్తున్నారని తెలిసింది.

మోహనరాజాతో కథ పై మరింతగా వర్క్ చేయమని చెప్పారట నాగార్జున. ప్రస్తుతం మోహనరాజా కథ పై మళ్లీ కసరత్తు చేస్తున్నారని సమాచారం. నాగార్జున హీరోగా నటించే ఈ మూవీలో అఖిల్ కీలక పాత్ర చేస్తున్నారని తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరిలో ఈ సినిమాను ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ సినిమాతో నాగార్జున బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి.. సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్