Monday, January 20, 2025
HomeTrending Newsకాంగ్రెస్ కు నల్లారి గుడ్ బై

కాంగ్రెస్ కు నల్లారి గుడ్ బై

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కు తన రాజీనామా లేఖ పంపారు. తన ఈ లేఖను రాజీనామాగా పరిగణించాలని కోరారు.

కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరుతున్నట్లు రెండ్రోజుల క్రితమే తెలియవచ్చింది. కేంద్రంలోని బిజెపి ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారని సమాచారం. అయితే అయన ఏపీ కేంద్రంగా పనిచేస్తారా లేక తెలంగాణా పార్టీలో కీలక పాత్ర పోషిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా ప్రాతినిధ్యం వహించింది చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంనుంచి అయినా ఆయన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే జరిగింది. తెలంగాణా వ్యాప్తంగా ఆయనకు అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్