Balayya fire:
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో తన చెల్లి భువనేశ్వరిని కించపరిచేలా మాట్లాడడం బాధాకరమని ఎమ్మెల్యే, సినీ నటులు నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలుగా విధానాలపై పోరాడలే కానీ వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ప్రవర్తించడం తగదని హెచ్చరించారు. ఇన్నేళ్ళలో చంద్రబాబు కంటతడి పెట్టడం ఎన్నడూ చూడలేదన్నారు. వారి ఇంట్లో జరిగిన ఓ హత్య కేసులో వారి కుటుంబ సభ్యులే అనుమానం వ్యక్తం చేశారని, ఈ అంశంపై మాట్లాడదామని అడిగితే దానికి ఈ విధంగా మాట్లాడతారా అని బాలకృష్ణ నిలదీశారు.
తాను కూడా ఎమ్మెల్యేగా ఉన్నానని, సభలో ఉద్రిక్తతలు, పరస్పర వాదోపవాదాలు జరుగుతుంటాయని, బైట కలిసిపోయి ఉంటామని కానీ ఈ విధంగా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం ఎన్నడూ జరగలేదన్నారు. భువనేశ్వరికి రాజకీయాలతో సంబంధం లేదని, ఎన్నో సేవా కార్యక్రమాల్లో వెన్నుదన్నుగా నిలుస్తారని అలాంటి వ్యక్తిపై ఇలా మాట్లాడ్డం సరికాదన్నారు. వారు మాట్లాడే మాటలు వారి ఇంట్లో వ్యక్తులు కూడా హర్షించరని అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై, విధానాలపై చర్చలు జరపాలి కానీ, ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం హేయమైన విషయమన్నారు. అసెంబ్లీలో ఉన్నామా, గోడల చావిట్లో ఉన్నామా అనిపించిందన్నారు.
- ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకు కూర్చోలేదు
- మీరు ఇప్పటికైనా మారకపోతే మేడలు వంచి మారుస్తాం
- రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కదారి పట్టించడానికి ఇంత నీచానికి దిగాజారుస్తారా?
- ఇకపై నోరు జారితే ఎవరినీ ఉపేక్షించం
- ఇలాంటి వ్యాఖ్యలను వారి ఇళ్ళల్లో వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు
- అందరి ఇళ్ళలోనూ తల్లులు, పెళ్ళాలు, పిల్లలు ఉన్నారు, ఇది గుర్తుంచుకోవాలి
- ప్రతిపక్షంగా మంచి సలహాలు ఇస్తే తీసుకోరు, ప్రతి దాన్నీ వంకలు పెట్టి డైవర్ట్ చేస్తారు
- ఇప్పటిదాకా చంద్రబాబును చూసి తాము సహనంతో వ్యవహరించాము
- ఇకపై సహించేది లేదు, ఒక్కొక్కరి భరతం పడతాం
- దేనికైనా ఓ హద్దు ఉంటుంది
- బాలయ్యలో ప్రవహిస్తున్నది ఎన్టీఆర్ రక్తమే
- మరోసారి ఇలా జరిగితే, నీచ, నికృష్ట మాట్లలు మాట్లాడితే మాకు ఏ వ్యవస్థలు అడ్డు గోడలు కాలేవు
- వాటిని దాటుకొని బైటకొస్తాం
- పదవులు ఎవరికీ శాశ్వతం కాదు
Also Read : భోరున విలపించిన బాబు