Saturday, January 18, 2025
HomeసినిమాMokshagna Teja: మళ్లీ వార్తల్లోకి మోక్షజ్ఞ ఎంట్రీ

Mokshagna Teja: మళ్లీ వార్తల్లోకి మోక్షజ్ఞ ఎంట్రీ

బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనే దాని పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆమధ్య మోక్షజ్ఞ బాగా లావుగా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదు. అందుకనే ఫిజిక్ పై కాన్ సట్ ట్రేషన్ చేయడం లేదు అని వార్తలు వచ్చాయి. అయితే.. ఇటీవల బాగా స్లిమ్ గా తయారైన ఫోటోలు బయటకు వచ్చినప్పటి నంచి మోక్షజ్ఞ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు అంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది.

దీంతో మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు ఎవరు అనే చర్చ మళ్లీ మొదలైంది. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 తీయాలి అనేది బాలయ్య కోరిక. ఈ చిత్రానికి బాలకృష్ణే దర్శకత్వం వహించాలి అనుకుంటున్నారు. ఈ సినిమాలోని కీలక పాత్ర ద్వారా మోక్షజ్ఞను తెలుగు తెరకు పరిచయం చేయాలి అనేది ప్లాన్ అని టాక్ వినిపించింది. మరో వైపు పూరి జగన్నాథ్, బోయపాటి, క్రిష్, అనిల్ రావిపూడి తదితరుల పేర్లు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వేడుకలో మోక్షజ్ఞ, డైరెక్టర్ మలినేని గోపీచంద్ కలిసి మాట్లాడుకున్న విజువల్ ఒకటి బయటకు వచ్చింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో బయటకు రాలేదు కానీ.. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందని అర్థం అయ్యింది. ఈ వీడియో వైరల్ అయినప్పటి నుంచి మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. మొత్తానికి అయితే.. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దం అవుతుందని క్లారిటీ వచ్చేసింది. మరి.. బాలయ్య.. మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యతను ఎవరికి అప్పగిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్