అడివి శేష్ హీరోగా నాని నిర్మాణంలో ‘హిట్ 2’ సినిమా రూపొందింది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, ఒక ముఖ్యమైన పాత్రలో కోమలీ ప్రసాద్ కనిపించింది.  శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నడిచే థ్రిల్లర్ మూవీ ఇది. తొలి రోజునే ఈ సినిమా 11.27 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అన్ని ప్రాంతాల నుంచి సక్సెస్ టాక్ వస్తుండటంతో, ఈ సినిమా టీమ్ నిన్న రాత్రి ‘బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ ను నిర్వహించింది.

ఈ వేదికపై నాని మాట్లాడుతూ .. “అడివి శేష్ ను చూస్తుంటే నాకు టెన్షన్ గా అనిపిస్తూ ఉంటుంది. నేను చదువుకునే రోజుల్లో నాకంటే ఎక్కువగా ప్రిపేర్ అయ్యేవాడిని చూసి నేను చాలా టెన్షన్ పడేవాడిని. అలాంటి టెన్షన్ ను అడివి శేష్ పెడుతున్నాడు. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించి అన్ని విషయాల్లో ఆయన పెర్ఫెక్షన్ కోరుకుంటాడు. ఏ విషయంలోను ఆయన రాజీపడడు. అలాగే ఈ ప్రాజెక్టు మొదలైన దగ్గర నుంచి, తాను పరిగెడుతూ మా టీమ్ ను పరిగెత్తించాడు.

శేష్ ఈ మధ్య కాలంలో వరుస హిట్లు ఇస్తూ వెళుతున్నాడు. అందుకు కారణం ఆయన మేజిక్ ను కాకుండా కష్టాన్ని నమ్మడమే అని నాకు అనిపించింది. ఎడిటింగ్ పై గ్యారీ బీహెచ్ .. ఫొటోగ్రఫీపై మణికందన్ తమకి గల పట్టు ఎలాంటిదో ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. మీనాక్షి గ్లామర్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. కోమలీ ప్రసాద్ నటన గొప్పగా ఉంది. ఇకపై ఆమెకి పోలీస్ పాత్రలే కాదు .. డిఫరెంట్ రోల్స్ వస్తాయని భావిస్తున్నాను. ఈ సినిమాను హిట్ చేసిన ఆడియన్స్ కి థ్యాంక్స్” అంటూ ముగించాడు.

Also Read :  ‘హిట్ 2’ గురించి బాలయ్య, మహేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *