Sunday, January 19, 2025
Homeసినిమాచరణ్‌, బన్నీని ఫాలో అవుతున్న నాని..

చరణ్‌, బన్నీని ఫాలో అవుతున్న నాని..

రామ్ చరణ్ ఊర మాస్ క్యారెక్టర్ చేసిన మూవీ ‘రంగస్థలం’. ఇందులో చరణ్ గ్రామీణ యువకుడు క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీలో పుష్ప.. పుష్పరాజ్.. అంటూ ఊర మాస్ క్యారెక్టర్ లో నటించాడు. ఈ సినిమా దేశవిదేశాల్లో సంచలనం సృష్టించింది. చరణ్‌, బన్నీ బాటలో నాని కూడా ఊర మాస్ క్యారెక్టర్ చేశాడు. అదే.. ‘దసరా’ మూవీ. ఇందులో నానికి జంటగా కీర్తి సురేష్‌ నటించింది. గోదావరిఖనిలోని బొగ్గు గనుల నేపధ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాకు నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.

అయితే.. నాని మార్కెట్ అంచనా వేయకుండానే దసరా మూవీకి ఏకంగా 65 కోట్ల ఖర్చు చేశారు. రంగస్థలం సినిమా లాంటి రఫ్ అండ్ రగ్డ్ సినిమా. కులాల గొడవల బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న కథ అని టాక్ వినిపిస్తోంది. ఇలా రంగస్థలం తరువాత ఫాలో..ఫాలో అన్నట్లు అనుకుంటే… ఇది చాలక పుష్ప టైపులో నాని గెటప్.. స్టిల్స్. సరే, అది అయిపోయింది అనుకుంటే..ఇప్పుడు రెండు భాగాలు అంటూ బయ్యర్లకు హింట్ ఇస్తున్నారు. ఓవర్ సీస్ లో సినిమాను ఎలాగైనా అమ్మేసుకోవాలన్న కోరికతో, రెండో పార్ట్ వుందనే ఫీలర్ పుట్టించారు.

అసలు విషయం ఏమిటంటే… సినిమా చివర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. విలన్ కొడుకు విలన్ గా మారే ట్విస్ట్ ఇచ్చి క్లోజ్ చేసి, రెండో భాగం వుందనే ఫీల్ కలిగిస్తారట. అంటే సినిమా హిట్ అయితే మరో భాగంతో ముందుకు వెళ్లొచ్చు. లేదంటే లేదు అనే టైపులో అన్నమాట. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని రాబడుతుందా..? అనేది మేకర్స్ కు టెన్షన్ గా మారింది. పైగా కొత్త దర్శకుడిని నమ్మి ఇంత పెట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి.. దసరా బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్