Saturday, January 18, 2025
Homeసినిమానాని, ప్ర‌శాంత్ నీల్ షాకింగ్ కాంబినేష‌నలో న్లో సినిమా.?

నాని, ప్ర‌శాంత్ నీల్ షాకింగ్ కాంబినేష‌నలో న్లో సినిమా.?

Nani-Neel: కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలు సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా ప్ర‌శాంత్ నీల్ పేరు మారుమ్రోగింది. ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అండ్ స్టార్ హీరోలు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. కేజీఎఫ్ 2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో స‌లార్ అనే భారీ చిత్రం చేస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న అందాల తార శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయ‌నుంది.

ఇక స‌లార్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నుంది. ఇటీవ‌ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేయ‌నున్నారు. గ‌తంలో ఈ సినిమా విష‌య‌మై చ‌ర‌ణ్‌, ప్ర‌శాంత్ నీల్ క‌ల‌వ‌డం జ‌రిగింది. ప్ర‌శాంత్ నీల్ కూడా చ‌ర‌ణ్ తో సినిమా చేయ‌నున్న‌ట్టుగా తెలియ‌చేశారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా నేచుర‌ల్ స్టార్ నానితో ప్ర‌శాంత్ నీల్ ఓ భారీ చిత్రం చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. టాలీవుడ్‌లో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో కూడా నాని నటిస్తున్నాడని టాక్ వ‌చ్చింది. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న మూవీలోనూ నాని న‌టించ‌నున్న‌ట్టుగా టాక్ వ‌చ్చింది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై నాని క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : కేజీఎఫ్ డైరెక్ట‌ర్ కి పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్