Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనారాయణ చైతన్యం

నారాయణ చైతన్యం

Who is great? జె ఈ ఈ అడ్వాన్స్ ఫలితాలొచ్చిన ప్రతిసారీ నాకు దిగులుతో కూడిన వైరాగ్యంతో పుట్టిన అయోమయం వెంటపడుతుంది. నేను అలాంటి మనవాతీతులు సాధించే పరీక్ష రాయలేదని కానీ, మా అబ్బాయికి కూడా ఆ అవకాశం రాలేదని నాకు ఏ కోశానా బాధ లేదు.

అడ్వాన్స్ ఫలితాలొచ్చిన మరు క్షణం టీవీల్లో, మరుసటి రోజు పత్రికల్లో వచ్చే ప్రకటనలు చూడాలన్నా, చదవాలన్నా  భయంగా ఉంటుంది. బాధగా ఉంటుంది. సిగ్గుగా ఉంటుంది. ఏ కోచింగ్ సెంటర్ ప్రకటనలో చూసినా ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ వారికే వచ్చి ఉంటుంది. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ పది, పదిహేను పెద్ద కోచింగ్ సెంటర్లకు సమానంగా పంచే ర్యాంకుల ప్రజాస్వామికీకరణ నూత్న విద్యా విధానం ఏదయినా ఉండి ఉంటే నా అజ్ఞానం క్షమింపబడుగాక!

ఈరోజు నారాయణ ప్రకటనలో “ప్రత్యర్థులు చెప్పుకునేట్లు మావి ఫేక్ ప్రకటనలు కావు” అని ఉంది. బహుశా నారాయణ ప్రకటనలో ప్రత్యర్థి “చైతన్య” అయి ఉండాలి.

ఒక్కోసారి ఇలాంటి ప్రకటనల వల్ల సమాజానికి మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. చైతన్య గురించి చెబితే నారాయణే చెప్పాలి. అలాగే నారాయణ గురించి చెబితే చైతన్యే చెప్పాలి. అమ్మ పుట్టిల్లు మేనమామలకే బాగా తెలుస్తుంది.

భారతదేశంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఏటా విద్యకు అయ్యే ఖర్చులో సున్నాలు లెక్కపెట్టడానికి ఇన్ఫినిటీ నంబర్లు కనుక్కున్న శ్రీనివాసరామానుజన్ దిగిరావాల్సిందే.

పిల్లల ర్యాంకుల ప్రకటనల్లో అతిశయోక్తులు, అర్ధ సత్యాలు, అసత్యాలు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసినప్పుడు ఐ ధాత్రి రాసిన వ్యాసమిది. తాజా అడ్వాన్స్ డ్ ప్రకటనల హోరు నేపథ్యంలో పొద్దుపోవడానికి ఒకసారి చదవండి.

పిల్లల ప్రకటనల్లో అతిశయోక్తులు వద్దు

మల్లి మెరిసిన ఆకాశియాన్స్!
ఈనాడులో మొదటి ఫుల్ పేజీ రంగుల ప్రకటన ఆల్ ఎడిషన్స్ అంటే ఒక రోజుకు యాడ్ టారిఫ్ 30 లేదా 35 లక్షలు ఉండవచ్చు. అంత ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చేవారు అనువాదాన్ని గాలికి వదిలేస్తున్నట్లుంది. యాడ్ ఏజెన్సీలు ప్రకటనను మొదట ఇంగ్లీషులో తయారు చేసి ఆపై గుడ్డి గూగుల్ అనువాదంతో ప్రాంతీయ భాషల్లోకి దించుతున్నాయి.

జె ఈ ఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో ఆలిండియా మొదటి ర్యాంక్ అని ఆకాష్ ప్లస్ బైజూస్ ఈనాడులో ప్రకటన ఇచ్చుకుంది.

“మల్లి మెరిసిన ఆకాశియాన్స్!” అని తాటికాయంత అక్షరాల శీర్షిక. ఆ అమ్మాయి పేరు మల్లి అయి ఉందనుకుంటే… కింద స్పష్టంగా తనిష్క కాబ్రా అని ఉంది. “మళ్లీ” అన్న మాట “మల్లి” అయ్యిందని అప్పుడు తట్టింది.

నిజమే.
చక్కగా పిల్లలకు పెల్లిల్లే అయి పిల్లా పాపలతో చల్లగా ఉంటున్నప్పుడు మళ్లీ మళ్లీ అన్న మాట మల్లి మల్లి గా రూపాంతరం చెందడంలో తప్పు లేదు. ఇది ఆకాశియాన్స్ అందరికీ మల్లె పువ్వు గుభాళింపులా వెల్లివిరిసిన మల్లి మెరుపు.
ఆకాశియాన్స్! చివర ప్రతీకాత్మకంగా ఆశ్చర్యార్థకం కూడా చక్కగా ఒదిగి…అసలు సంగతిని చెప్పకనే చెబుతోంది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

ముందే ఒప్పుకున్న తప్పులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్