Sunday, January 19, 2025
Homeసినిమాఆగస్టు 14న ఆర్ నారాయణ మూర్తి  ‘రైతన్న’ విడుదల

ఆగస్టు 14న ఆర్ నారాయణ మూర్తి  ‘రైతన్న’ విడుదల

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం ‘రైతన్న’ ఆగస్టు14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఆర్ నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు. “ఆగస్టు 14న రైతన్న సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలని ఈ సినిమా తీశాను. ఈ చిత్రం ద్వారా చెప్పే విషయం ఏమిటంటే… నేటి రైతు పరిస్థితి గురించి. భారత దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా వుంది అంటే అది రైతు కుటుంబమే.  రైతే దేశానికి వెన్నుముక. రైతే రాజు…ఆ నానుడి ఏమైంది. ఆ రైతు ఎక్కడున్నాడు” అనేదే కధాంశం.

“అన్నం పెట్టే అన్నదాత ఏ పొజిషన్ లో వున్నాడు ఈరోజు? చాలా బాధాకరంగా వుంది రైతు పరిస్థితి. ఎందుకంటే రైతు తను పండించే పంటకి మార్కెట్లో గిట్టు బాటు ధర రాక తన అప్పులు తీర్చుకో లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొస్తున్నాడు. అలా కాకూడదు….తు ఆత్మ హత్య చేసుకోకూడదు. అన్నం పెట్టే  రైతుకి గిట్టుబాటు ధర కావాలి. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్స్ లను ఇంప్లిమెంట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వాటికి చట్ట బద్దత కలిపించిన నాడు రైతే రాజు. రైతే దేశానికి వెన్నుముక. అప్పుడు రైతు వృద్ధి లోకి వస్తాడు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగనే రోజు రావాలని.. అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసిన చిత్రమే ఈ రైతన్న”అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్