Sunday, November 24, 2024
HomeTrending Newsఇక నుంచి ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్

ఇక నుంచి ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్

నేటి నుంచి మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ తయారు చేసిన.. రెండు డ్రాపుల నాసల్ వ్యాక్సిన్కు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. రెండు చుక్కల నాసికా టీకాకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఈ నాసల్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండనుంది. కొవీషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్నవారు ఈ నాసల్ వ్యాక్సిన్ను హెటిరో లాగస్ బూస్టర్గా తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందు టీకా.. ఇన్ కొవాక్ను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నవంబర్లో అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దీనికి కేంద్రం ఆమోదం లభించగా.. ఇవాళ సాయంత్రం నుంచి కొవిన్ ప్లాట్ ఫాంలో అందుబాటులోకి రానుంది. మనదేశంలో 18 ఏళ్ల వయసు దాటినవారు ఈ టీకా వినియోగించేందుకు ఆరోగ్య శాఖ వీలు కల్పించింది.
ఇంజెక్షన్ ద్వారా కాకుండా చుక్కల ద్వారా ఇచ్చే టీకాను తయారు చేయడం భారత్‌లో ఇదే ఫస్ట్ టైం. ప్రస్తుతానికి దేశంలో భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కొవీషీల్డ్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వి, బయోలాజికల్ ఈ లిమిటెడ్‌కు చెందిన కొర్బెవాక్స్‌ టీకాలు కరోనాకు మందుగా ఇస్తున్నారు. ఇవి కొవిన్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి.
మరోవైపు చైనాలో కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ప్రధాని మోడీ కోరారు. ఎయిర్ పోర్టుల్లో కరోనా ఆంక్షలను కచ్చితంగా పాటించాలన్నారు. పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడిన ప్రధాని.. అధికారులు, మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్