Saturday, November 23, 2024
HomeTrending Newsసోనియా, రాహుల్ కు ఈడి సమన్లు

సోనియా, రాహుల్ కు ఈడి సమన్లు

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈడి ముందు విచారణకు హాజరుకావాలని కోరినట్లు ఈ మేరకు ఆ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు.

జూన్ 8న ఈడీ ఎదుట హాజరుకావాలని సొంయాగాందిని ఈడీ కోరింది. జూన్ 2వ తేదీ హాజరుకావాలని రాహుల్ గాంధీని కోరగా.. తాను దేశం వెలుపల ఉన్నందున మరికొంత సమయం కావాలని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్, సోనియాలను జూన్ 8న హాజరుకావాలని ఈడీ కోరింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ లీగల్ సెల్ నేత అభిషేక్ మనుసింఘ్వీ వెల్లడించారు.

మరోవైపు ఈడీ సమన్లపై కాంగ్రెస్ మండిపడింది. 2011-12 నాటి నేషనల్ హెరాల్డ్‌ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా బీజేపీ – బ్రిటిష్ వలస పాలకులను గుర్తు చేస్తోందని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1942లో ప్రారంభించారని, అప్పట్లో బ్రిటిష్ వారు దానిని అణిచివేసేందుకు ప్రయత్నించారని, నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడీని కూడా అదే పనిగా ఉపయోగించుకుంటోందని రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు.

Also Read : సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్