Saturday, January 18, 2025
HomeసినిమాKhairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న నవీన్ పోలిశెట్టి

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న నవీన్ పోలిశెట్టి

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తాజాగా సక్సెస్ సాధించిన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్న నవీన్ పొలిశెట్టితనకు నటుడు అవ్వాలనే కోరిక వినాయక చవితి ఉత్సవాల్లోనే పుట్టిందని అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో కనిపించే సందడి, అక్కడ జరిగే హంగామా తనలో నటుడు ఉన్నాడని తెలిసేలా చేసిందన్నారు. వినాయక చవితి సందర్బంగా ఖైరతాబాద్ మహాగణపతిని నవీన్ పొలిశెట్టి దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. నవీన్ కు ఉత్సవ సమితి సభ్యులు సాదర స్వాగతం పలికి సత్కరించారు.

అనంతరం ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాల్లో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న నవీన్ పొలిశెట్టి… తన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయవంతమైనందుకు గణేశుడికి కృతజ్ఞలు తెలిపాడు. ఈ ఏడాది కొలువుదీరిన విద్యామహాగణపతి… భక్తులకు మంచి విద్య, ఉన్నతి కల్పించాలని ప్రార్థిస్తున్నట్లు నవీన్ పేర్కొన్నారు. నవీన్ పోలిశెట్టి రాకతో ఖైరతాబాద్ గణేశుడి వద్ద సందడి నెలకొంది. ఉత్సవ సమితి సభ్యులతో పాటు పలువురు భక్తులు నవీన్ తో సెల్ఫీలు తీసుకుంటూ ఆనందించారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్