Monday, July 1, 2024
HomeసినిమాGOD: నయన్ ఫ్యాన్స్ కోసం వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్!

GOD: నయన్ ఫ్యాన్స్ కోసం వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్!

తెలుగులో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో మెరిసిన నయనతార, రీసెంట్ గా వచ్చిన ‘జవాన్’ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో నయన్ యాక్షన్ దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె నుంచి ‘గాడ్’ అనే సినిమా థియేటర్లలోకి దిగిపోవడానికి రెడీ అవుతోంది. జయం రవి సరసన ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. తమిళంలో ‘ఇరైవన్’ టైటిల్ తో ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను ‘గాడ్’ పేరుతో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఈ నెల 13వ తేదీన థియేటర్ల దగ్గర చెప్పుకోదగించిన సినిమాలేం లేవు. అందువలన ‘గాడ్’ సినిమాను విడుదల చేస్తున్నారు. అహ్మద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో జయం రవి కనిపించనున్నాడు. ఆయనను ప్రేమించే యువతిగా నయనతార కనిపించనుంది.

ఒక సైకో వరుస హత్యలు చేసుకుంటూ వెళుతుంటాడు. అతణ్ణి పట్టుకోవడం కోసం హీరో ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో అతనికి ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి? అనేదే కథ. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ట్రైలర్ చూస్తే .. భయంకరమైన హత్యలు .. రక్తపాతం కనిపిస్తున్నాయి. ఈ జోనర్ కథలను .. నయనతార నటనను ఇష్టపడే అభిమానులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందేమో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్