Saturday, November 23, 2024
HomeTrending Newsడ్రగ్స్ కేసులో ఆర్యన్ కు క్లీన్ చిట్

డ్రగ్స్ కేసులో ఆర్యన్ కు క్లీన్ చిట్

Free:  ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ  క్లీన్ చిట్ ఇచ్చింది.  ఆర్యన్ తో పాటు మరో ఆరుగురుకి ఈ కేసు నుంచి విముక్తి లభించింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు దర్యాప్తు ఆధారాలు  లేకపోవడంతో ఆర్యన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.

గత ఏడాది అక్టోబర్ 3న ముంబై క్రూయిజ్ షిప్ పై దాడి చేసిన ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆర్యన్ కూడా ఉన్నాడు. ఆ సమయంలో పలువురు వ్యక్తులు, సంఘాలు షారుఖ్ ను నిందించాయి. కొడుకుని సరిగా పెంచలేదని, ఆర్యన్ అలా తయారవడానికి తండ్రి పెంపకమే కారణమని దుయ్యబట్టాయి. బాలీవుడ్ లో కొందరు, మరికొన్ని సంఘాలు షారూఖ్ కు సంఘీభావం తెలిపాయి. దాదాపు 22 రోజులపాటు ముంబై ఆర్థర్ రోడ్ జైలు లో గడిపిన ఆర్యన్ కు అక్టోబర్ 28న బెయిల్ లభించింది.  అయితే ఈ కేసులో  ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖేడే పాత్రపై అనుమానాలు తలెత్తాయి. ఆర్యన్ ను కేసు నుంచి తప్పించేందుకు 25 కోట్ల రూపాయల లంచం అడిగారాయని సమీర్ పై ఆరోపణలు వచ్చాయి. దీనితో ఆయన్ను దర్యాప్తు నుంచి తప్పించి ఢిల్లీ సెంట్రల్ యూనిట్ కు కేసును అప్పగించారు.

ఈ కేసుపై  సమగ్ర దర్యాప్తు జరిపామని, ఆర్యన్ కు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్  పేరిట ఓ ప్రకటన విడుదలైంది.

Also Read :

డ్రగ్స్ కేసులో కొత్త కోణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్