Saturday, January 18, 2025
Homeసినిమాకళ్యాణ్ రామ్ 'డెవిల్' కోసం 80 భారీ సెట్స్

కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ కోసం 80 భారీ సెట్స్

ఓ వైపు హీరోగా విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ.. మరో వైపు నిర్మాతగా వైవిధ్యమైన చిత్రాలను అందిస్తున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. తాజాగా కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘డెవిల్”. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. స్వాతంత్ర్యానికి ముందు కథాంశంతో రూపొందుతోన్న ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ భారీ సెట్స్ ను వేశారు. ఈ సెట్స్ సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  ఏకంగా 80 సెట్స్ వేయటం విశేషం.

1940 బ్యాక్ డ్రాప్ లో  కాబట్టి దానికి  తగ్గట్లు ఆర్ట్ డైరెక్టర్ గాంధీ సెట్స్ ను రూపొందించారు. బ్రిటీష్  పాలన నాటి సెట్స్ వేయటం తనకెంతో ఛాలెంజింగ్ గా అనిపించిందని గాంధీ పేర్కొన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్ ను రూపొందించటానికి కావాల్సిన సామాగ్రిని తెప్పించామని,  నిర్మాత అభిషేక్ నామా గారి సపోర్ట్ లేకుండా ఈ రేంజ్ లో భారీ సెట్ వేసి సినిమా రిచ్ గా తెరకెక్కించటం సాధ్యమయ్యేది కాదని తెలిపారు. నవంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్